Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates1
హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు.

Waqf Bill Discussion In Lok Sabha NDA-INDIA Live Updates2
లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు.. స్పీకర్‌ హెచ్చరిక

Waqf Bill In Lok sabha Updates..వక్ప్‌ భూములపై కిరణ్‌ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్‌ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్‌ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్‌ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్‌ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్‌ బోర్డు అన్నది.వక్ప్‌ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్‌ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్‌ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్‌ బ్యాంక్‌ వక్ఫ్‌ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్‌ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్‌ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్‌ బ్యాంక్‌ వక్ఫ్‌ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం​ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్‌ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్‌ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్‌ షా కామెంట్స్‌..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్‌ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్‌ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్‌ రిజుజు కామెంట్స్‌..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్‌ బిల్లులో​ సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు..వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్‌ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్‌ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు కామెంట్స్‌..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్‌ కామెంట్స్‌..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్‌ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్‌..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్‌ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్‌ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్‌(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్‌(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్‌ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్‌ జారీ చేశాయి. వక్ఫ్‌ (సవరణ) బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్‌ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్‌ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

SC To Hear Party Defections In Telangana April 2nd Live Updates3
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. గత విచారణలో బీఆర్‌ఎస్‌ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఇవాళ స్పీకర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు సరైందే: ముకుల్‌ రోహత్గీస్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు సరికాదు: ముకుల్‌ రోహత్గీస్పీకర్‌ విషయంలో హైకోర్టు జోక్యం సరికాదు: ముకుల్‌ రోహత్గీహైకోర్టు జోక్యం చేసుకోవద్దా: జస్టిస్‌ గవాయ్‌ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?: జస్టిస్‌ గవాయ్‌గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు: జస్టిస్‌ గవాయ్‌అది ప్రత్యేకమైన కేసు: ముకుల్‌ రోహత్గీస్పీకర్‌ ఒకసారి నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్‌ సమీక్షకు అవకాశంసుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంది: ముకుల్‌ రోహత్గీనిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చు: ముకుల్‌ రోహత్గీసరైన సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్‌కు చెప్పలేమా? : జస్టిస్‌ గవాయ్‌స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా?: జస్టిస్‌ గవాయ్‌స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు: ముకుల్‌ రోహత్గిఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు: ముకుల్‌ రోహత్గిగత విచారణలో బీఆర్‌ఎస్‌ తరఫున ఆర్యమా సుందరం వాదిస్తూ.. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్‌ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారని.. ఆ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామంటున్నారని చెప్పారు. .. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ గవాయ్‌.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అలాగే.. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయన్న ఆయన.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ప్రతివాదులు కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కోరగా.. బెంచ్‌ కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని మందలించింది.సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని గత విచారణలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Shreyas Didnt Get Credit: Gavaskar Lambast Lack Of Recognition in KKR 2024 Win4
శ్రేయస్‌ అయ్యర్‌కు ఆ క్రెడిట్‌ దక్కలేదు: టీమిండియా దిగ్గజం

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొడుతోంది. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సారథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచిన పంజాబ్‌.. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. పంత్‌ సేనను సొంత మైదానంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండో గెలుపు నమోదు చేసిందిఇక ఈ రెండు విజయాల్లోనూ పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అ‍య్యర్‌ది కీలక పాత్ర. గుజరాత్‌పై 42 బంతుల్లోనే 97 పరుగులతో చెలరేగిన అయ్యర్‌.. లక్నోతో మ్యాచ్‌లో 30 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధనాధన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.బ్యాటింగ్‌ నైపుణ్యాలు అద్భుతంఈ నేపథ్యంలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌పై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్‌ బ్యాటింగ్‌ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. అదే విధంగా.. అయ్యర్‌ పట్ల కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వ్యవహరించిన తీరును గావస్కర్‌ ఈ సందర్భంగా విమర్శించాడు.శ్రేయస్‌ అయ్యర్‌కు ఆ క్రెడిట్‌ దక్కలేదు‘‘2024లో కేకేఆర్‌ను గెలిపించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌. కానీ అతడికి దక్కాల్సిన, రావాల్సిన గుర్తింపు రాలేదు. కేకేఆర్‌ విజయంలో అతడికి క్రెడిట్‌ దక్కలేదు. ఏదేమైనా అతడి కెప్టెన్సీ రికార్డు ఎంతో గొప్పగా, ఆకట్టుకునే విధంగా ఉంది’’ అని గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు.కాగా ఐపీఎల్‌-2024లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో కోల్‌కతా జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేకేఆర్‌కు మరోసారి టైటిల్‌ దక్కడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే, ఈ విజయం మెంటార్‌ గౌతం గంభీర్‌ ఖాతాలో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ కంటే ఎక్కువగా గౌతీకే క్రెడిట్‌ దక్కింది.రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందే కేకేఆర్‌ ఫ్రాంఛైజీతో శ్రేయస్‌ అయ్యర్‌ తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2025 వేలంపాటలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంఛైజీలన్నీ ఎగబడ్డాయి. అయితే, ఎంత ధరకైనా వెనుకాడని పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి ఆఖరికి అతడిని దక్కించుకుంది. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది.ఈ క్రమంలో పైసా వసూల్‌ ప్రదర్శనతో శ్రేయస్‌ అయ్యర్‌ రాణిస్తుండటంతో పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. ఇదే జోరులో వరుస విజయాలు సాధించి.. తొలి టైటిల్‌ గెలవాలని ఆకాంక్షిస్తోంది. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 117 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3276 పరుగులు సాధించాడు. ఇందులో 23 అర్ధ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్‌-2025: లక్నో వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లు👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్‌ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్‌ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (34 బంతుల్లో 69).చదవండి: లక్నో బౌలర్‌ ఓవరాక్షన్‌.. భారీ షాకిచ్చిన బీసీసీఐ

gold and silver rates today on market in telugu states5
ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.92,990గా ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులు చెందలేదు. స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్‌ మిండావెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లే వెండి ధరల్లోనూ బుధవారం ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు(Silver Price) ప్రస్తుతం రూ.1,14,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

KSR Comment On Kutami Red Book Applying IAS Officers Too6
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్‌ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేన‍ంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్‌ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Telangana police lathi charge  On HCU Students7
HCU వద్ద తీవ్ర ఉద్రి‍క్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌(వీడియో)

సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. LathiCharge on Students of University of Hyderabad who have protesting to stop cutting down the 400 acres Trees in the campus pic.twitter.com/1iQC52779t— Dr.Krishank (@Krishank_BRS) April 2, 2025అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా నాయకులు వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.#HCU విద్యార్థులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్న పోలీసులు 😡#ShameOnRahulGandhi#SaveHCU#SaveHCUBioDiversity pic.twitter.com/SKlUxibKEq— BRS News (@BRSParty_News) April 2, 2025

Nara Lokesh PA Sambashiva Rao Danda In Tirumala Tickets8
నారా లోకేష్‌ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్‌..

సాక్షి, తిరుమల/మంగళగిరి: తిరుమల దర్శనాల్లో మంత్రి నారా లోకేష్‌.. పీఏ దందా వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు బయటకు వచ్చాయి. పీఎస్‌ టూ సీఎంవో అంటూ దర్శన సిఫార్సు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్‌ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాలకు సంబంధించిన దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎస్‌ టూ సీఎంవో అంటూ సాంబశివరావు.. తిరుమల జేఈవో కార్యాలయానికి దర్శన సిఫార్సు లేఖలు పంపిస్తున్నారు. రోజుకు 12కుపైగా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. సాంబశివరావు పనిచేసేది మంగళగిరిలో అయితే తిరుమల జేఈవో కార్యాలయంలో సీఎంవో పేరుతో దర్శనాలు ఇప్పిస్తున్నారు.ఇక, ఏపీ సీఎంవో పేషీతో ఎలాంటి సంబంధం లేని సాంబశివరావు సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు దర్శనాలు కొనసాగిస్తున్నారు. అయితే, మంత్రుల సిఫార్సు లేఖలతో రోజుకు రెండు దర్శనాలు మాత్రమే అనుమతి ఉంది. వారి సిఫార్సులతో వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే ఒక్క రోజుకు అనుమతి ఉంటుంది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు ఐదు నుంచి ఆరు వేలకు పైగా వీఐపీ దర్శనాలు పెరిగాయి. ఇష్టారాజ్యంగా కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాలను పెంచి సామాన్య భక్తుల దర్శనాలను మరింత ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై విచారణ చేపట్టాలని హిందుత్వ సంఘాలు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Rashmika Mandanna: I Can not Believe Iam Already Turning 299
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా

హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. యానిమల్‌, పుష్ప 2: ద రూల్‌, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్‌ అందుకుని బాక్సాఫీస్‌ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్‌ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.నా విషయంలో నిజం కాదుఅయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్‌ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్‌.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.నమ్మబుద్ధి కావట్లేకానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్‌ విన్నపం

Radhika Merchant Styles A 35 Year Old Corset With Chanderi Saree10
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్‌ న్యూ లుక్‌...ఇదే తొలిసారి!

అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్‌ స్టైల్‌లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్‌ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్‌ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్‌ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్‌నురీ మోడల్‌ చేసి కార్సెట్-సారీ ట్రెండ్‌ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్‌ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్‌ క్లో' (1743-174) పెయింటింగ్‌ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్‌ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్‌ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్‌ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్‌కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్‌. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్‌లెట్‌గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్‌ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement