Top Stories
ప్రధాన వార్తలు

సినీ ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ బెదిరింపులు!
సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన. ‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు... వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్ పేరిట ప్రకటన వెలువడింది.

ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు.

గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన లాలూ కొడుకు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) అందరినీ సర్ప్రైజ్ చేశారు. సింగిల్ స్టేటస్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను, తన ప్రేమను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేయడం గమనార్హం.అనుష్క యాదవ్(Anushka Yadav) అనే అమ్మాయితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని, తాము గతకొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నామని తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశానని, అంతా తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారాయన. ఈ పోస్ట్ బీహార్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరు తేజ్ ప్రతాప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్ నేపథ్యం కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ఈ యువనేత.. తాను అక్కడ సింగిల్‌గా లేననే విషయాన్ని తాజా పోస్టుతో స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్-రబ్రీదేవి జంటకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కూతుళ్ల తర్వాత ఏడో సంతానంగా తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించాడు. చిన్న కొడుకు, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ చివరి సంతానం. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు గతంలో వివాహం జరిగింది.బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య(Tej Pratap Yadav Wife Aishwarya)తో 2018లో తేజ్ ప్రతాప్ వివాహం అయ్యింది. అయితే ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని తేజ్ ప్రతాప్, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య ఐదు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా.. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.

‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు.

Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్‌ది కీలక పాత్ర.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్యర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ ముంబై బ్యాటర్ అదరగొడుతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.శ్రేయస్ గత 12 ఇన్నింగ్స్‌లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని అయ్యర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ జట్టులో ఉంటే మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అభిమానులైతే ఒకడుగు ముందుకు వేసి సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన

రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.

కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో
గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india)

బాలీవుడ్లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్ ఇక లేరు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు. ముకుల్ దేవ్‌కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.చదవండి: కన్నప్ప టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది: ఆర్కే రోజా
శ్రేయస్ అర్ధ శతకం, రాణించిన స్టొయినిస్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన లాలూ కొడుకు
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్రం ప్రకటన
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
'షష్టి పూర్తి' ట్రైలర్.. మంచి ప్రయత్నం
ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు'.. తెరపైకి రియల్ స్టోరీ
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
భారత్‌కు అండగా ఉంటాం
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఏలూరులో ఘరానా మోసగాడు
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది: ఆర్కే రోజా
శ్రేయస్ అర్ధ శతకం, రాణించిన స్టొయినిస్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన లాలూ కొడుకు
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్రం ప్రకటన
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
'షష్టి పూర్తి' ట్రైలర్.. మంచి ప్రయత్నం
ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు'.. తెరపైకి రియల్ స్టోరీ
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
భారత్‌కు అండగా ఉంటాం
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఏలూరులో ఘరానా మోసగాడు
గంట సేపు సముద్రం చీలుతుంది
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
సినిమా

ఓటీటీలో నాని 'హిట్ 3' సినిమా.. స్ట్రిమింగ్ వివరాలు ఇవే
నాని 'హిట్3: ది థర్డ్ కేస్'(HIT: The Third Case) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ దుమ్మురేపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడు.'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. రాబోవు సినిమాల జాబితాలో హిట్3ని నెట్‌ఫ్లిక్స్ చేర్చించి. గురువారం (మే 29)న స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. ఇప్పటికే 'ప్యారడైజ్' షూటింగ్లో నాని జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల (శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో సల్మాన్, రష్మికల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రూ. 210 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. బాలీవుడ్లో విడుదలైన సినిమాలు కొన్ని 8వారాలకు ఓటీటీలో విడుదలౌతున్నాయి. ఇదేబాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. మే 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే, కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.కథకథ చాలా పాతదే.. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్‌కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్‌కోట్‌కు రెండు పేర్లు ఉంటాయి. సికందర్, రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరికోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే, ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు. మంత్రి ప్రధాన్ అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు..? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్ అగర్వాల్)కు ఉన్న సమస్య ఏమిటి..? అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.

‘థియేటర్స్ బంద్’పై ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది అవాస్తవం అని..ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ కోరారు. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని చెప్పారు. ‘చర్చలు జరగకపోతే, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పారు కానీ..దాన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అలాంటిదేమి జరగడం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి మూడు సెక్టర్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.నిర్ణిత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం. 30న ఈసీ సమావేశమై కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం. థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది.కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం’ అని దామోదర ప్రసాద్ అన్నారు.

'ఒక బృందావనం' మూవీ రివ్యూ
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో నూతన నటీనటులతో తెరకెక్కించే సినిమాలు ఎక్కువయ్యాయి. వాటిలో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి కూడా. అలా వచ్చిన మరో చిన్న చిత్రమే ‘ఒక బృందావనం’. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కెమెరామెన్ రాజా విక్రమ్(బాలు) ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. మహి(షిన్నోవా).. చనిపోయిన వాళ్ల అమ్మ చేయాలనుకున్న డ్యాక్యుమెంటరీని తీయాలనుకుంటుంది. దీని కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అనాథ అయిన నైనికా(సాన్విక)..తనకు ప్రతి క్రిస్మస్కి బహుమతులు పంపిస్తున్న జోసెఫ్(శుభలేక సుధాకర్)ని కలిసి తన పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అనాథ ఆశ్రమం నుంచి పారిపోవాలనుకుంటుంది. ఈ ముగ్గురు వివిధ కారణాలతో కలుస్తారు. మహి తన డాక్యూమెంటరీకి కెమెరామెన్‌గా రాజాను తీసుకుంటుంది. జోసెఫ్ని కలిపిస్తామని చెప్పి.. నైనికతో డాక్యూమెంటరీ వీడియో తీసేందుకు ఒప్పిస్తారు. అసలు ఆ డాక్యూమెంటరీ దేని గురించి? చివరకు అది పూర్తయిందా లేదా? అమెరికా వెళ్లాలనుకున్న రాజా కోరిక నెరవేరిందా? నైనికాకు జోసెఫ్ ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు? చివరకు జోసెఫ్ని నైనికా కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్ జర్నీయే ‘ఒక బృందావనం’ మూవీ. కథ పరంగా ఇది రొటీనే అయినా.. కథనం, స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. వినోదంతో పాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందించాడు దర్శకుడు. ఫస్టాప్ కాస్త సాగదీతగా అనిపించినా.. ద్వితియార్థం అంతా చాలా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. మూడు పాత్రల పరిచయానికే దర్శకుడు సమయం ఎక్కువ తీసుకున్నాడు. ఈ ముగ్గురు కలిశాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకడాఫ్‌లో జోసెఫ్ని వెతుక్కుంటూ ఈ ముగ్గురు చేసే ప్రయాణం చుట్టే కథనం తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తే..మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కథనం కాస్త నెమ్మదిగా సాగినా.. ఓపికతో చూస్తే మాత్రం హృదయాలను ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ,వయోలెన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చి దిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించినవారంతా నూతన నటీనటులే అయినప్పటికీ చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరామెన్ రాజాగా బాలు చక్కగా నటించాడు. మహి పాత్రకి పిన్నోవా న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మహేందర్, మహబూబ్ బాషాల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక సీరియర్ నటీనటులు శుభలేక సుధాకర్, శివాజీ, అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సన్నీ సాకేత్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 801 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 25 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 43 పరుగులు చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్(694) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. విన్స్ హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి ఈ ఫీట్ నమోదు చేశాడు.టీ20ల్లో ఒకే జట్టు తరుపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 801 ఫోర్లుజేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 694 ఫోర్లుఅలెక్స్ హేల్స్ (నాటింగ్‌హామ్‌షైర్) – 563 ఫోర్లురోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 550 ఫోర్లుల్యూక్ రైట్ (సస్సెక్స్) – 529 ఫోర్లుఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీకి సన్‌రైజర్స్ ఝులక్ ఇచ్చింది. బెంగళూరుపై 45 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా..అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), క్లాసెన్(24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది.చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ. 24 లక్షల జరిమానా

ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగిన గిల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్‌కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్‌బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్‌గా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ

ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కరుణ్ నాయర్, శార్థూల్ ఠాకూర్ వంటి వెటరన్ ప్లేయర్లు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టెస్టు క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న షమీని సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టరాన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు."షమీ గత వారం రోజులగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు. సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేస్తే షమీపై వర్క్ లోడ్ పడుతోంది. మా వైద్య బృందం సూచన మేరకు అతడిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టాల్సి వచ్చింది. షమీ ఈ సిరీస్‌కు ఫిట్‌గా ఉంటాడని మేము కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తూ అతడి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఫిట్నెస్ లేని ప్లేయర్ ఎంపిక చేయడం కంటే వేరే ఆటగాడికి అవకాశమివ్వడం ఉత్తమమని భావించాము. అందుకే షమీని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. షమీ తన చివరి టెస్టు మ్యాచ్.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ తన కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 3.30 ఉంది. ఈ ఫార్మాట్లో అతను 6 సార్లు 5 వికెట్ల హాల్‌తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ములేపుతున్న యువ సంచలనం సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరి ఆశ్చర్యపరిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025
బిజినెస్

ఇకపై ఆలా కుదరదు: శాంసంగ్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదు అనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇక్కడే (అమెరికాలో) ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.సౌత్ కొరియా దిగ్గజమైన 'శాంసంగ్' అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇందులో సుమారు 60 శాతం ఫోన్స్.. వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకుని వస్తే.. సుంకాలు చెల్లించక తప్పదు.

ఎల్ఐసీ గిన్నిస్ రికార్డ్: 24 గంటల్లో..
ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు అమ్ముడయ్యాయని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అనేది.. మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత పనికి నిదర్శనం. కస్టమర్లు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఎల్ఐసీ పేర్కొంది. జనవరి 20న 'మ్యాడ్ మిలియన్ డే' నాడు ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎల్ఐసీ ఎండీ & సీఈఓ సిద్ధార్థ మొహంతి చేపట్టిన చొరవకు నిదర్శనమే ఈ రికార్డు అని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీఈఓ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. 'మ్యాడ్ మిలియన్ డే'ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.Life Insurance Corporation of India Achieves GUINNESS WORLD RECORDS™️. Most Life Insurance Policies Sold In 24 Hours.#LIC #LICInsurancePolicy #GuinnessWorldRecord pic.twitter.com/WRTwZ7UtLt— LIC India Forever (@LICIndiaForever) May 24, 2025

సుంకాలు విధించినా మరేం ఫర్వాలేదు
భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ఆ దేశంలో తయారీతో పోలిస్తే మొత్తం ఉత్పత్తి వ్యయం ఇండియాలో చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక తెలిపింది. యాపిల్ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించుకుంటే ఐఫోన్లపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ మేరకు జీటీఆర్ఐ వివరాలు వెల్లడించింది.ఇండియాలో ఎందుకంత చౌక..?అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ తయారీ వ్యయాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కార్మికులకు అయ్యే ఖర్చుల వ్యత్యాసాలు భారీగా ఉండడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసే కార్మికులకు నెలకు సుమారు 230 అమెరికన్ డాలర్లు(సుమారు రూ.20,000) ఖర్చు అవుతుంది. అయితే కాలిఫోర్నియా వంటి యూఎస్ రాష్ట్రాల్లో కార్మికుల ఖర్చులు నెలకు 2,900 అమెరికన్ డాలర్లు(రూ.2,44,760)కు పెరుగుతాయి. భారత్‌తో పోలిస్తే ఇది 13 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.ప్రస్తుతం సుమారు 1,000 డాలర్ల(రూ.85,000)గా ఉన్న ఐఫోన్ తయారీలో యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్ ద్వారా అధికంగా 450 డాలర్ల వాటాను సమకూరుస్తుంది. మిగతాది ఇతర దేశాల నుంచి సమీకరిస్తున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌కు వెచ్చిస్తుంది.యూఎస్ కాంపోనెంట్ మేకర్స్ (క్వాల్కామ్, బ్రాడ్‌కామ్): 80 డాలర్లుతైవాన్ (చిప్ తయారీ): 150 డాలర్లుదక్షిణ కొరియా (ఓఎల్ఈడీ స్క్రీన్లు, మెమొరీ చిప్స్): 90 డాలర్లుజపాన్ (కెమెరా): 85 డాలర్లుజర్మనీ, వియత్నాం, మలేషియా (ఇతర భాగాలు): 45 డాలర్లుచైనా, ఇండియా (అసెంబ్లింగ్): 30 డాలర్లుఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానాఐఫోన్ అసెంబ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న భారతదేశం, చైనా మొత్తం రిటైల్ ధరలో 3% కంటే తక్కువే సంపాదిస్తుండడం గమనార్హం. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్ విధించినప్పటికీ దేశంలో ఐఫోన్ల తయారీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని నివేదిక తెలుపుతుంది. ప్రభుత్వం నుంచి యాపిల్ భారత్‌లో ఐఫోన్ తయారీపై ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) ప్రయోజనాన్ని సైతం పొందుతుంది.

రేంజ్ రోవర్ హిమాలయన్: సరికొత్త స్పెషల్ ఎడిషన్
రేంజ్ రోవర్ రణథంబోర్ స్పెషల్ ఎడిషన్ మంచి ఆదరణ పొందటంతో.. కంపెనీ ఇప్పుడు మరో స్పెషల్ ఎడిషన్‌ను 'హిమాలయన్' పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది లేత పెయింట్ షేడ్స్ పొందనున్నట్లు సమాచారం.రేంజ్ రోవర్ హిమాలయన్ ఎడిషన్ గురించి కంపెనీ చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ఇప్పుడున్న అన్ని ఎడిషన్స్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఎన్ని యూనిట్లకు పరిమితం చేసింది. ఎప్పటి నుంచి విక్రయిస్తుందనే విషయాలను కూడా వెల్లడించలేదు.స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరగడంతో.. హిమాలయన్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు.. జేఎల్ఆర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ లింపెర్ట్ పేర్కొన్నారు. కస్టమర్లు మరిన్ని స్పెషల్ ఎడిషన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము మరో మోడల్ ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..గతంతో పోలిస్తే.. రేంజ్ రోవర్ కార్లు మంచి అమ్మకాలను పొందుతున్నాయి. గడచిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో లగ్జరీ విభాగంలో మూడో స్థానానికి చేరింది. రేంజ్ రోవర్ & రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క స్థానిక అసెంబ్లీ మోడళ్ల అమ్మకాలు 2.5 రెట్లు పెరిగాయి.
ఫ్యామిలీ

ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)

కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్‌తో
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ ఫిలి ఫెస్టివల్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్‌తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా గోల్డ్, డైమండ్స్‌తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ డైమండబ్యాగ్ ధర ఎంతో తెలుసా?గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్‌తో వివాదాన్ని రూపి, కొంతమందినెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్‌ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్‌కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.బంగారు రంగు ఫిష్‌టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ, హైలైట్‌గా నిలిచించి మాత్రం గోల్డ్ బికినీ బ్యాగ్.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ బస్ట్-షేప్డ్ బికినీ బ్యాగ్‌ను ధరించింది. మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్‌తోపాటు, ఖరీదైన రత్నాలు, స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్లు, ఫ్యాన్సీ నెక్లెస్‌ల కలగలుపుతో తయారు చేశారు. చేయబడింది. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్‌వేర్‌తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్‌ను కలిగి ఉంది. షోల్టర్ చైన్‌తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్‌తో కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195 అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్ఫోటోషూట్ కోసం ఊర్వశి ఏం చేసిందంటే..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్ చేసిందట. రెడ్ కార్పెట్ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా, తన పోజుల్లో మునిగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం.

ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
భరించలేని భారం అధిక బరువు. ఏటా చాలామంది యువత ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరూ పట్టుదలతో బరువు తగ్గి స్ఫూర్తిగా నిలవగా మరికొందరూ సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వందలు లేదా అంతకు మించి బరువు ఉన్నవారిని చూశాం. కానీ వాటన్నింటిని తలదన్నేలా ఏకంగా 222 కిలోల బరువు అంటే వామ్మో అనేస్తాం. పైగా అంత భారీకాయం ఉన్న వ్యక్తి తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి సింపుల్‌గా తనికిష్టమైన హాబీతో తగ్గి చూపించి..శెభాష్ అనిపించుకుంటున్నాడు. అంత బరువు ఉండే వ్యక్తి ఎలా స్లిమ్‌గా మారాడో చూద్దామా..!.అమెరికాలోని ఒహియోకు చెందిన 36 ఏళ్ల ర్యాన్ గ్రూవెల్ దాదాపు 222 కిలోల బరవు ఉండేవాడు. ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాను అనేది పట్టించుకోకుండా నచ్చిన ఫుడ్ అమాంతం లాగించేసేవాడు. తనకిష్టమైనది ప్రతీది తినేయడం దానికి తోడు శారీరక శ్రమ లేకపోవడం కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నాడు. తెలియకుండానే అలా ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడంతో..అంత ఈజీగా దాన్ని వదిలించుకోలేకపోయాడు. ఫలితంగా తానే విస్తుపోయేలా లావైపోయాడు. ఇక లాభం లేదనుకుని బరువు తగ్గే కార్యక్రమాలకు ఉపక్రమించాడు. వాకింగ్ చేయాలనుకుంటే..తన అధిక బరువు కారణంగా విపరితీమైన మోకాళ్ల నొప్పులు వేధించేవి. ఇక ఇలా కాదని..మే 6, 2023న సైకిల్ కొనుగోలు చేసి..సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ హాబీ జీవితాన్నే మార్చేసింది..ర్యాన్‌కి చిన్నప్పటి నుంచి సైక్లింగ్ మంచి హాబీ. సరదా..సరదాగా.. చేసే హాబీతో ఊహించని విధంగా 124 కిలోలకు తగ్గిపోయాడు. ర్యాన్ గణనీయమైన బరువు కోల్పోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతోపాటు స్వీట్లు, ఆల్కహాల్, ఫాస్ట్‌ఫుడ్‌కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ మేకి 90 కిలోలకు చేరాడు. ర్యాన్ కూడా ఇంతలా బరువు తగ్గుతానని అస్సలు ఊహించలేదంటూ సంబరపడుతున్నాడు. అయితే తాను అనుకున్న లక్ష్యం ఇంకా చేరుకోలేదని..ఆరోగ్యకరమైన వ్యక్తిలా మంచి బరువు చేరుకునేదాక..తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని ధీమాగా చెబుతున్నాడు. ఇక్కడ ర్యాన్ కథ చూస్తే..అసాధారణ బరువుని..జస్ట్ మనకు నచ్చిన అభిరుచితో ఎలా మాయం చేయొచ్చొ చెబుతోంది. అలానే అందరూ కూడా తాము చేయగలిగే వర్కౌట్లతో వెయిట్ లాస్కి ప్రయత్నిస్తే..విజయం తథ్యం అని నొక్కి చెప్పొచ్చు కదూ..!. View this post on Instagram A post shared by Ryan Grewell (@ryan_grewell) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)

వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్‌లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇండిగో ఘటన వేళ.. వక్రబుద్ధి చాటుకున్న పాక్!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్.. పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!. బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు.. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్‌లోనే విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనలు అనుమతించవు.ఇదీ చదవండి: పాక్ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్

మాకు నీళ్లు ఆపితే.. భారతీయుల ఊపిరి ఆపేస్తా: పాక్ ఆర్మీ అధికారి
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత తోక ముడిచిన పాకిస్తాన్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. భారతీయుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు సింధూ జలాలను ఆపితే.. భారత ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ హెచ్చరించారు. అయితే, గతంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాకిస్తాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ..‘భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే.. మేము వారి ఊపిరిని అడ్డుకుంటాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గతంలో 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా ఇద్దరూ ఒకే విధంగా మాట్లాడటం వెనుక కారణమేంటి? అనేది తెలియాల్సి ఉంది. పాక్ ఆర్మీకి చెందిన అధికారి ఇలా.. ఉగ్రవాది తరహాలో మాట్లాడటమేంటని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందన్నారు. భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాక్‌కు చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.A spokesperson for the Pakistani military issued a warning to India regarding the suspension of the Indus Water Treaty, quoting terrorist Hafiz Saeed with the statement: ‘If you cut off our water, we will cut off your breath.’pic.twitter.com/hl45IPfLVM— Harsh Patel (@Harshpatel1408) May 23, 2025మరోవైపు.. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశాల్లో పాక్ చర్యలను ఎండగడుతున్నారు. తాజాగా జైశంకర్.. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాక్‌కు తెలియదనే భావనను ఖండించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌లోనే ఉన్నారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్దపెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసు. వారు ఏ చర్యలకు ఒడిగడుతున్నారో తెలుసు. వారి మధ్యలో ఉన్న సంబంధాలు తెలుసు. పహల్గాం ఉగ్రదాడిలో పాక్‌కు తన ప్రమేయం లేదని నటించకూడదు. పాక్ ప్రభుత్వం ఉగ్రసంస్థలకు సహకారం అందిస్తోంది. పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతకుముందు.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే విధంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 23న భారత్ సింధూ జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది.

సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది?
ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహారవిహారాదులలోనే కాకుండా, భాష వినియోగంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విరివిగా ఉపయోగించే పదాలు ఇప్పుడు మృగ్యమవుతున్నాయి. వీటిలో వ్యాకరణ చిహ్నాలకూ మినహాయింపేమీ లేదు. ఈ జాబితాలోకే వస్తుంది సెమీ కాలన్(Semi-colon)(;).. ఇప్పుడిది కనుమరుగయ్యే దశకు చేరుకుందని బాషా నిపుణులు అంటున్నారు. ఆంగ్ల వ్యాకరణంలో సెమికోలన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ఒక విరామ చిహ్నం. ఒకే వాక్యంలోని సారూప్యత కలిగిన రెండు అంశాలను వేరు చేయడానికి సెమికోలన్ వినియోగిస్తారు. ఉదాహరణకు ‘పొద్దున్న ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది; అది 10 గంటలకు గమ్యానికి చేరుతుంది’ వీటి మధ్య కనిపిస్తున్న(;) చిహ్నమే సెమికోలన్. ఆంగ్ల వాక్యాలలో ఒకప్పుడు విరివిగా ఉపయోగించే ఈ చిహ్నం ఇప్పుడు కనుమరుగవుతోంది. దీనికి పలు కారణాలున్నాయి.ఆంగ్ల భాష అభ్యాసానికి ఉపయుక్తమయ్యే సాఫ్ట్వేర్ బాబెల్(Software Babel) సాగించిన ఒక అధ్యయనంలోని వివరాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా, ఇంగ్లీష్ పుస్తకాలలో సెమికోలన్ వాడకం వేగంగా క్షీణిస్తూ వస్తోంది. ఒకప్పుడు రచయితలు సెమీకోలన్‌ను స్వీకరించి, పరిపూర్ణ వాక్యాలను రూపొందించడానికి విరివిగా ఉపయోగించారు. లియో టాల్‌స్టాయ్ రాసిన ‘అన్నా కరెనినా’లో ప్రారంభ పంక్తిలోనే సెమికోలన్ కనిపిస్తుంది. ఆంగ్ల భాషలో సెమికోలన్ అనేది దగ్గరి సంబంధం కలిగిన రెండు వాక్యాలను ఒకే వాక్యంగా లింక్ చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తుంటారు.సెమికోలన్ ఉపయోగం ఇప్పుడున్న వారిలో చాలా తక్కువమందికే తెలుసని నిపుణులు అంటున్నారు. పాఠశాలల్లోనూ దీని ప్రాధాన్యతను తగ్గించారనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాలలో సాహిత్యాన్ని అధ్యయనం చేసే వారు కూడా సెమికోలన్ను గుర్తించడంలేదని అధ్యయనంలో వెల్లడయ్యింది. భారతదేశంలోని ఆంగ్ల రచయితలు కూడా ఈ వ్యాకరణ చిహ్నాన్ని అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. మరోవైపు సెమికోలన్ను తప్పుగా వినియోగిస్తే, ఆ వాక్యం అపార్థానికి దారితీసే అవకాశం కూడా ఉంది. అందుకే పలువురు రచయితలు దీని వినియోగాన్ని విస్మరిస్తున్నారు. అయితే ఆంగ్ల నిపుణులు సెమికోలన్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, వాక్యాలలో దీనిని వినియోగించడం ద్వారా మరింత స్పష్టమైన అర్థాన్ని వ్యక్తం చేయవచ్చని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: World Turtle Day: తోటి తాబేలు పక్కనున్నా..

విదేశీ విద్యార్థులకు కెనడా ఝలక్.. స్టడీ పర్మిట్లలో భారీ తగ్గుదల
న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు షాక్ తగిలింది. స్టడీ పర్మిట్లలో పోనుపోను భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. తాజాగా వెల్లడైన ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) గణాంకాలు ఈ వివరాలను తేటతెల్లం చేశాయి.2025 తొలి త్రైమాసికానికిగానూ కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే కిందటి ఏడాది ఇదే సమయంలో 44, 295 పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే.. దాదాపు 31 శాతం తగ్గిందన్నమాట.2023 చివరి నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో వలసల వల్ల కెనడాపై అన్ని రకాలుగా తీవ్ర భారం పడుతోందని అక్కడి లిబరల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. 2028 నాటికల్లా కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశీ ఉద్యోగులు.. విద్యార్థులు కలిపి 5 శాతానికి మించి ఉండకూదంటూ ప్రధాని మార్క్ కార్నీ ఒక ప్రకటన చేశారు.ఇక గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.2023లో.. కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. ఇందులో భారతీయులకు జారీ చేసింది 2, 78,0452024కి వచ్చేసరికి.. మొత్తం 5,16,275 పర్మిట్లు జారీ చేయగా.. అందులో భారతీయుల కోసం జారీ చేసింది 1,88,4652025 నాటికి.. ఈ ఏడాదికిగానూ తొలుత 4,85,000 పర్మిట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 4,37,000 పర్మిట్లు మాత్రమే జారీ చేయాలని ఐఆర్సీసీ ఇప్పుడు భావిస్తోంది. ఇందులో భారతీయల పర్మిట్ల సంఖ్యను లక్షకు పరిమితం చేయాలని భావిస్తోందని స్పష్టమవుతోంది. 2026 కల్లా.. ఈ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉంది. మరోవైపు స్టడీ పర్మిట్ల దరఖాస్తుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మారాయి.
జాతీయం

నాకు లవర్ ఉన్నాడు.. చివరి నిముషంలో వధువు షాక్
యశవంతపుర(కర్ణాటక): సినిమాలో మాదిరిలో తాళి కట్టే సమయంలో ఆటంకం ఏర్పడింది, వధువు ఈ పెళ్లి చేసుకోనని మొండికేయడంతో వరునితో సహా అందరూ అవాక్కయ్యారు. హాసన్ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆదిచుంచనగిరి కళ్యాణ మంటపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అనే వధూవరులకు ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. అన్నిశాస్త్రాలను పూర్తి చేశారు. వధూవరులను పెళ్లి వేదికపై తీసుకొచ్చి మాంగళ్య ధారణ పూర్తి చేసే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టంచేసింది. వేరే యువకున్ని ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించారు, పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు. కానీ పెళ్లికూతురు మెట్టు దిగలేదు. ముందే చెప్పి ఉంటే.. ఇంత జరగడంతో వరుడు వేణుగోపాల్‌కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు ఎంతగానో విలపించినా పల్లవి మనసు కరగలేదు. ఆమె ప్రేమ విషయం తెలియదు. తెలిసి ఉంటే పెళ్లిని కుదిర్చేవాళ్లమే కాదు అని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు షాక్‌లో ఉండటం వల్ల ఏమి మాట్లాడలేక పోతున్నారు. లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. ఇక పెళ్లికొడుకు వారు కూడా బాగా వ్యయం చేశారు, ఆ మొత్తం పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. *ಹಾಸನ: ಮಾಂಗಲ್ಯಧಾರಣೆ ವೇಳೆ ಬಂತು ಪ್ರಿಯಕರನ ಕರೆ…! ಮದುವೆ ನಿಲ್ಲಿಸಿ ಎಂದು ಕುಸಿದುಬಿದ್ದ ವಧು…!*https://t.co/XvQIrQfQlS*Download the App and know your city news* - https://t.co/HTbKZOoDTa pic.twitter.com/ZhmWNnEAGF— PublicNext (@ElectReps) May 23, 2025

43 ఏళ్ల న్యాయపోరాటం.. 104 ఏళ్ల వృద్ధునికి జైలు నుంచి విముక్తి
కౌశాంబి: దేశంలోని కొన్ని కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి కొసాగుతుంటాయంటారు. ఇలాంటి పెండింగ్ కేసుల కారణంగా కోర్టును ఆశ్రయించిన పలువురు ఇబ్బందులు పడుతుంటారు. ఇదే తరహాకు చెందిన ఒక ఉదంతం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. హత్య, హత్యాయత్నం నేరాల కింద 43 ఏళ్లపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత 104 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది.యూపీలోని అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కౌశాంబి జిల్లా జైలు అధికారులు ఆయన్ను విడిచిపెట్టారు. కౌశాంబి జిల్లా గౌరయె గ్రామానికి చెందిన లఖన్ 1921 జనవరి 4వ తేదీన జన్మించినట్లు జైలు రికార్డుల్లో(prison records) ఉంది. 1977 ఆగస్ట్ 16వ తేదీన గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాట సమయంలో ప్రభు సరోజ్ అనే వ్యక్తిని చంపడంతోపాటు మరొకరిపై హత్యాయత్నం ఆరోపణలపై లఖన్, మరో ముగ్గురిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో 1982లో ప్రయాగ్‌రాజ్ సెషన్స్ కోర్టు ఈ నలుగురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.దీనిపై లఖన్ అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)కు అప్పీల్ చేసుకున్నారు. దిగువ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే నిందితుల్లో ముగ్గురు చనిపోయారు. తాజాగా, అలహాబాద్ హైకోర్టు లఖన్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆయన్ను విడుదల చేయాలని మే 2వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జైలు అధికారులు మంగళవారం లఖన్‌ను విడుదల చేసి, కౌశాంబి జిల్లాలోని షరీరా ప్రాంతంలో ఉంటున్న ఆయన కుమార్తె ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు.ఇది కూడా చదవండి: Hamburg: రైల్వేస్టేషన్లో కత్తితో దాడి.. 12 మందికి గాయాలు

మూడో కాన్పుకూ ప్రసూతి ప్రయోజనాలు
న్యూఢిల్లీ: మూడో కాన్పు అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన కె.ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్‌పై శుక్రవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కాన్పులకే వర్తిస్తాయి. ఈ కారణంగా మూడో కాన్పుకు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాలు చేయగా ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘‘తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగేనాటికి ఆమె ఉద్యోగంలోనే చేరలేదు. పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు’’ అని గుర్తు చేసింది. ఆ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ తీరును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల పునరుత్పత్తి హక్కుల్లో, ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వోద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుతోందని హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలను ఉటంకిస్తూ గుర్తు చేసింది. ఉమాదేవికి ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కలి్పంచాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

చూపు లేకున్నా.. ఎవరెస్ట్‌పై కాలు మోపింది!
సిమ్లా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు అంధత్వ సైతం అడ్డంకి కాదని నిరూపించిందీ ధీర. హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పల్లెకు చెందిన గిరిజన మహిళ ఛోంజిన్ అంగ్మో త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంపై రెపరెపలాడించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలోనే ఐదో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. హెలెన్ కెల్లర్నే ఆదర్శంగా తీసుకున్న అంగ్మో..చూపున్నా దార్శనికత లేకపోవడం అంధత్వం కంటే ఘోరమైన విషయమని చెబుతున్నారు..! ఇండో–టిబెటన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల చంగో గ్రామంలో జని్మంచిన అంగ్మో ఎనిమిదేళ్ల వయస్సప్పుడు చూపు పూర్తిగా కోల్పోయారు. అయినప్పటికీ చదువు ఆపలేదు. పట్టుదలతో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని మిరాండా హౌస్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సరీ్వస్ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గర్వించిన పుట్టిన ఊరు అంగ్మో తండ్రి అమర్ చంద్ ఏమంటున్నారంటే..‘నా కుమార్తె సాధించిన ఘనతను చూసి నాకు ఆనందంగాను, గర్వంగాను ఉంది. ఎవరెస్ట్‌పై విజయం సాధించిన ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నా’అని తెలిపారు. అంగ్మో సాధించిన రికార్డుతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే అంగ్మో ఎంతో ధైర్యవంతురాలు, పట్టుదల కలిగిన వ్యక్తి అని బంధువు యమ్చిన్ తెలిపారు. జీవితంలో ఎన్ని ఎదురుపోట్లు ఎదురైనా వెరువక ప్రతి సవాల్‌ను ఒక అవకాశంగా మల్చుకున్నారు అంగ్మో. ‘నా కథ ఇప్పుడే మొదలైంది. అంధత్వం నా బలహీనత కాదు, బలం’అని చెప్పారు. ‘ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం నా చిన్ననాటి కల. ఈ విషయంలో ఆర్థికపరమైన అవరోధాలను అధిగమించాను. మిగతా శిఖరాలను సైతం అధిరోహించాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాను’అని వివరించారు.కల సాకారమైందిలా.. చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు 2016లో బేసిక్ మౌంటెయినీరింగ్ కోర్సు పూర్తి చేసి, ఉత్తమ ట్రెయినీగా నిలిచారు అంగ్మో. 2018లో ఈమె 5,486 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తయిన మనాలి– ఖర్దుంగ్ లా రోడ్డులో అతిశీతల పరిస్థితుల్లో పది రోజులపాటు సైక్లింగ్ చేశారు. 2019లో ఆరు రోజులపాటు మూడు రాష్ట్రాల్లోని నీలగిరి కొండల్లో సైక్లింగ్ చేశారు. గతేడాది జూలైలో మనాలి నుంచి కాల్పా వరకు ఏడు రోజులపాటు సైక్లింగ్ సాగించారు. 2021లో సియాచిన్ గ్లేసియర్‌ను చేరుకున్న దివ్యాంగుల బృందంలో ఏకైక అంధురాలుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సుమారు 5,634 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు అధిరోహించిన మొట్టమొదటి అంధురాలైన భారతీయ మహిళగా అంగ్మో 2024 అక్టోబర్‌లో రికార్డు సాధించారు. అనంతరం, లద్దాఖ్‌లోని 6,250 మీటర్ల ఎత్తయిన కాంగ్ యాట్సే2 శిఖరాన్ని ఎక్కారు. దివ్యాంగ్ అధిరోహణ బృందంలో సభ్యురాలిగా 6 వేల మీటర్ల ఎత్తయిన మరో శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఆటల్లోనూ ప్రావీణ్యం చూపే అంగ్మో స్విమ్మింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం, జుడోలో జాతీయ స్థాయి చాంపియన్ షిప్, జాతీయ మారథాన్లలో రెండు రజత పతకాలు సాధించారు. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. అంగ్మో సాధించిన విజయాలను ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’లో కూడా ప్రస్తావించడం విశేషం. గతేడాది రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ జాతీయ అవార్డును అందుకున్నారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్‌లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్‌పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్‌కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్‌లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్‌లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్‌మనిపించి..
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు. చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్‌కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్‌ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.

ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు.