Top Stories
ప్రధాన వార్తలు

‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. అనంతరం, ‘స్కాంస్టార్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్‌తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025

ఆమే నేరంగా చూడడం లేదు.. అరుదైన తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పోక్సో చట్టం కింద శిక్ష పడ్డ ఓ వ్యక్తికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరట ఇచ్చింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగిస్తూ అతని శిక్షను రద్దు చేసింది. ఇదొక అరుదైన కేసుగా పేర్కొంటూ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘కుటుంబం ఆమెను వదిలేసింది. వ్యవస్థ ఆమెను నిందించింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. చట్టం దృష్టిలో ఇది నేరమే అయి ఉండొచ్చు. కానీ, బాధితురాలే జరిగిన దానిని నేరంగా పరిగణించడం లేదు. ఇప్పుడు ఆమె వేదనల్లా.. నిందితుడికి శిక్ష పడకుండా రక్షించుకోవాలని. అందుకోసమే ఆమె పోలీస్, న్యాయవ్యవస్థలతో పోరాడుతోంది. ఈ కేసులోని వాస్తవాలు.. ప్రతీ ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ కంటి తెరుపు. .. నిందితుడితో బాధితురాలికి ఉన్న భావోద్వేగ అనుబంధం, వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహా అసాధారణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ‘‘పూర్తి న్యాయం’’ అందించేందుకు ఆర్టికల్ 142(Article 142) కింద అధికారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జయ్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా అతని శిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఓకా తీర్పు వెల్లడించారు. సంచలన కేసుగా..పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. ఆ తర్వాత మైనార్టీ తీరాక ఆమెనే అతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. అయితే అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్(POCSO Act) కింద కేసు నమోదు అయ్యింది. కింది కోర్టులో శిక్షపడడంతో కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది. అయితే.. ఈ కేసులో సదరు వ్యక్తికి ఊరట ఇచ్చిన హైకోర్టు, తీర్పు ఇచ్చే ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును కొట్టేసి నిందితుడికి శిక్షను పునరుద్ధరించింది. దీంతో బాధితురాలు/అతని భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆపై ఈ కేసులో బాధితురాలి ప్రస్తుత మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది సుప్రీం కోర్టు. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం తాజాగా.. బాధితురాలి భర్తకు ఊరట ఇస్తు తీర్పు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏకంగా 27 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదా?

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ఒంగోలు: శుభకార్యం కోసం కారులో బంధువులు ఇంటికి బయల్దేరిన కుటుంబ సభ్యుల్ని మృత్యువు కబళించింది. బాధితుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిందిపోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహానంది నుంచి చీరాల వెళ్తున్న ప్రయాణికుల కారు కోమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించే ప్రయత్నించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ఘటన స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!
ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్ టిష్యూ పేపర్‌తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్‌లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్‌కు భజన , వైఎస్సార్సీపీ, జగన్‌పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్ జగన్(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్‌లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్‌ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్‌లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మాస్కోలో భారత ఎంపీల బృందానికి తప్పిన ముప్పు!
న్యూఢిల్లీ: రష్యాలో భారత ఎంపీల బృందానికి భయానక అనుభవం ఎదురైంది. వాళ్లు ఎక్కిన విమానం ల్యాండ్ అవ్వకుండా గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు చాలా ఆలస్యంగా.. విమానం ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం మాస్కో ఎయిర్‌పోర్టుపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో విమానాల రాకపోకలను ఆపేసి.. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసేశారు. అయితే ఎయిర్పోర్ట్ మూసేయడంతో భారత ఎంపీలు ఉన్న విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు అనుమతి లభించడంతో సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఆపై భారత రాయబార ప్రతినిధులు వాళ్లకు స్వాగతం పలికి సురక్షితంగా హోటల్‌కు చేర్చారు.All-Party Delegation led by Member of Parliament Ms. Kanimozhi Karunanidhi @KanimozhiDMK arrives in Moscow to convey 🇮🇳’s strong resolve to fight terrorism in all its forms. @PMOIndia @narendramodi @DrSJaishankar @MEAIndia @Office_of_KK @PIB_India @DDIndialive @DDNational… pic.twitter.com/Qu57uV5WHJ— India in Russia (@IndEmbMoscow) May 22, 2025పాక్‌పై దౌత్య యుద్ధంలో భాగంగా.. ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందని, దానిని భారత్ ఎలా ఎదుర్కొంటోందని.. అలాగే భారత్ విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపిస్తోంది. మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. మాస్కోకు వెళ్లిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వం వహిస్తున్నారు.

మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే..
ఆరుపదుల వయసులో కేన్సర్ నిర్థారణ అయ్యింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమేగాక మారథాన్లలో రికార్డులు సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాదు తన దీర్ఘాయువు రహస్యం గురించి చెప్పడమే పర్యావరణ పరిరక్షకుడి తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అతడెవరు..? ఎలా అన్నేళ్లు బతికి బట్టగట్టగలిగాడంటే..ఫ్లోరిడాకు చెందిన 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్ మారథాన్‌లో ఎన్నో వరల్డ్ రికార్డులు సాధించాడు. అంతేగాదు వేగంగా మారథాన్ చేసిన 91 ఏళ్ల వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా మారథాన్, హాఫ్ మారథాన్, కనోయింగ్ క్రీడా తదితరాలకు సంబంధించి అనేక ప్రపంచ రికార్డులు కలిగి ఉన్నాడు. నిజానికి మైక్ 60 ఏళ్ల వయసులో కేన్సర్ బారినపడ్డాడు. మహా అయితే మూడు నెలలకు మించి బతకడని తేల్చి చెప్పేశారు వైద్యులు. మరోవైపు ఆర్థరైటీస్ సమస్యలు కూడా ఉన్నాయతనికి. అప్పడే మైక్ తన ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని స్ట్రాంగ్ డిసైడయ్యాడు. ఆ నేపథ్యంలో కేన్సర్‌ని నివారించే ఆహారాల గురించి సవివరంగా తెలుసుకున్నాడు. దీర్ఘాయువుకి కీలకం ఆహారమే..అలా మైక్ పూర్తిగా మొక్కల ఆధారిత డైట్‌కి మారాడు. పూర్తిగా తాజా కూరగాయాలు, ఓట్మీల్ సిరప్, బ్లూబెర్రీస్, బీన్స్, బ్రోకలీ, తాజా పండ్లు తదితరాలను తీసుకునేవాడు. దాంతో రెండున్నర సంవత్సరాల తర్వాత అతడి శరీరంలో ఎలాంటి కేన్సర్ కణాలు లేవని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడే అతనికి తెలిసింది ఆరోగ్యానికి కీలకమైనది తీసుకునే పోషకవంతమైన ఆహరమని. ఒత్తిడి మత్యు ఒడికి చేర్చేది..ఒత్తిడి మనల్ని మరణం అంచులకు తీసుకువెళ్తుందని అంటాడు. అందుకే తాను ఒత్తిడి దరిచేరనివ్వని జీవితాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అంతేగాదు ఒత్తిడి సంబంధిత రుగ్మతలు ఎలా మరణ ప్రమాదాన్ని పెంచుతాయో కూడా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేని ప్రశాంత జీవితానికే ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు మైక్. కసరత్తులు..మైక్ మునుపటి వ్యాయామ నియమావళి ప్రకారం.. వారానికి మూడు సార్లు 10 మైళ్లు పరిగెత్తేవాడు. కానీ ఇప్పుడు..వారానికి మూడు సార్లు 5 మైళ్లు పరిగెత్తేలా కుదించాడు. బాగా వేడిగా వాతావరణం ఉంటే..కనోయింగ్ వంటివి చేస్తాడు..అంటే బోటింగ్ లాంటి ప్రక్రియ ఇది కూడా ఒకవిధమైన క్రీడ, పైగా వ్యాయామానికి ఒక కసరత్తులాంటిది. దుఃఖాన్ని అధిగమించేందుకు..తన మొదటి భార్య రక్తస్రావం కారణంగా చనిపోయిందట. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు 36 ఏళ్ల వయసులో పరుగుని ప్రారంభించాడట. దుఃఖాన్ని ఎదుర్కోవడానికి వ్యాయామం మంచి మార్గం అని అంటాడు. అకాల మరణాలతో ..అలాగే కాలేయ కేన్సర్‌తో 69 ఏళ్ల తండ్రి, 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో తల్లి మరణించటంతో ఆహారం, వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నాని..అదే ఇన్నేళ్లు ఆరోగ్యంగా బతికేందుకు దోహదపడిందని అన్నారు. దీర్ఘాయువుకి కారణం..తాను వాతావరణ కార్యకర్తగా పనిచేస్తుంటానని అన్నారు మైక్. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత భూమిని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నానని అన్నారు. ఆ ఆకాంక్ష వందేళ్లు పైగా ఆరోగ్యంగా బతికేందుకు కారణమైందని అన్నారు. సత్సంబంధాలను కలిగి ఉండటం..మైక్ వారానికి మూడుసార్లు తన స్నేహితులతో కలిసి మారథాన్‌కి వెళ్తుంటాడట. అలాగే వృద్ధుల కమ్యూనిటీ గ్రూప్‌లో కూడా ఒక మెంబర్. అప్పుడప్పుడూ వారితో కలిసి సంభాషిస్తూ ఉంటాడట. దీంతోపాటు తన భార్య, బంధువులతో కూడ కొంత టైం స్పెండ్ చేస్తాడట. ఈ సత్సంబంధాలే మనల్ని మరింత కాలం భూమిపై జీవించేలా చేస్తాయని అంటాడు మైక్.(చదవండి: అమీర్‌ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..)

ఇండిగో ఘటన వేళ.. వక్రబుద్ధి చాటుకున్న పాక్!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్.. పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!. బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు.. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్‌లోనే విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనలు అనుమతించవు.ఇదీ చదవండి: పాక్ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌లో షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోలేం అని నేషనల్ మీడియాకు చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇంగ్లండ్ సిరీస్‌కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్‌కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్‌లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.🚨 NO SHAMI IN ENGLAND TOUR 🚨 - Mohammed Shami is unlikely to play in the Test series against England. (Devendra Pandey/Express Sports). pic.twitter.com/tjIlRHFgR7— Tanuj (@ImTanujSingh) May 23, 2025ఇదిలాఉండగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కడపలో కరోనా పాజిటివ్ కేసుపై డీహెచ్ఎంవో కీలక ప్రకటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు ప్రచారంపై కడప డీహెచ్ఎంవో నాగరాజు స్పందించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణపై డీహెచ్ఎంవో నాగరాజు కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘కడప జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు లేవు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది. అందుకే ఆమెను కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నాం. ఆమెకు కరోనా నిర్ధారణ కాలేదు. వదంతులను నమ్మవద్దు అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ..రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటివి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి స్థలాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి.జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

కరోనా బారిన బాలీవుడ్ నటి ఫ్యామిలీ, ఎమోషనల్ పోస్ట్
కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250 కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో, మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది రెండవ అత్యధికం. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళలకు కోవిడ్ సోకినట్ట నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ఈ సంవత్సరం రెండు COVID-సంబంధిత మరణాలను కూడా నివేదించింది బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 పోటీదారు శిల్పా శిరోద్కర్ తనకు సోకిందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి కోవిడ్ బారిన పడినట్టు జాతీయమీడియా నివేదించింది. కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ మూవీల్లో నటించిన నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు, ఆమె కుటుంబంలో తల్లి ఇద్దరూ వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19) తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా తెలిపింది. స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపింది. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కూడా నికిత కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.
పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
థియేటర్స్‌లో వాటి ధరలు తగ్గిస్తే బెటర్: ఎస్కేఎన్
పచ్చ దండుకు కరోనా టెన్షన్
రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్: తొలిసారి..
జై హనుమాన్, వాడవాడలా హనుమజ్జయంతి వేడుకలు
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఘటికాచలం' ట్రైలర్
ఆమే నేరంగా చూడడం లేదు.. అరుదైన తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
థియేటర్స్‌లో వాటి ధరలు తగ్గిస్తే బెటర్: ఎస్కేఎన్
పచ్చ దండుకు కరోనా టెన్షన్
రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్: తొలిసారి..
జై హనుమాన్, వాడవాడలా హనుమజ్జయంతి వేడుకలు
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఘటికాచలం' ట్రైలర్
ఆమే నేరంగా చూడడం లేదు.. అరుదైన తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
సినిమా

తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తండ్రి అయ్యాడు. గురువారం(మే 22) ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.‘మగబిడ్డ పుట్టాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్'' అని కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇందులో కిరణ్ తన కుమారుడి చిట్టి పాదాలను ముద్దాడుతూ కనిపించారు.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు బాబు పుట్టినట్లు తెలిపారు. దీంతో అభిమానులు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు.ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ భైరవం’
‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు. దీంతో వైఎస్సార్సీసీ శ్రేణులు విజయ్ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్లో వైరల్ చేస్తున్నారు. విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్ కనకమేడల ఫేస్బుక్లో 2011లో చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఒక పోస్ట్ పెట్టాడు. హిందీలో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.హ్యాక్ అయిందా? అదేలా?సోషల్ మీడియాలో బాయికాట్ భైరవం ట్యాగ్ ట్రెండ్ కావడంలో విజయ్ కనకమేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025

‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నేడు(మే 23) ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్

ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్
‘‘వార్ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందిస్తూ– ‘‘వార్ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్‌లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్‌గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్‌కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా సుదర్శన్‌కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్‌లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్‌లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్‌లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్‌పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్‌కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్‌తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్‌గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్‌లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్‌లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్‌లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్‌లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్‌కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు.

పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్‌లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది.

క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్‌లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్‌లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్‌పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్‌కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్‌లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన తొమా పొపొవ్‌తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు.

LSG Vs GT: గుజరాత్‌కు లక్నో షాక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్‌జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. ఓపెనింగ్ ధాటితో... ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్‌ఖాన్‌పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు. మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ మార్‡్షతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్‌కాగా... రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్‌తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. షారుఖ్ పోరాడినా... కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్‌ఫొర్డ్, షారుఖ్‌లు సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది. 24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్‌ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్‌ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్‌ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్‌ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్‌కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్‌ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్‌దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్‌ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X హైదరాబాద్‌వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో
బిజినెస్

రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం లాభపడింది.అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్ సెషన్లో సెన్సెక్స్ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్ బాండ్ ఈల్డ్స్ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలురూపాయి 36 పైసలు క్రాష్విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు
న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్‌డేట్స్‌అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.

బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్‌తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ

సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికం శాఖ (డాట్) తాజాగా ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ (ఎఫ్ఆర్ఐ) పేరిట వినూత్న సాధనాన్ని ప్రవేశపెట్టింది. మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను రిస్కు స్థాయిని బట్టి ఇది వర్గీకరిస్తుంది. ఆ వివరాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా టెలికం శాఖ షేర్ చేస్తుంది.దీనిద్వారా రిస్కీ మొబైల్ నంబర్లతో ఆర్థిక లావాదేవీలను సత్వరం నిలిపివేసేందుకు ఇది ఉపయోగపడుతుందని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణమైనవిగా కనిపించినా వాస్తవానికి సైబర్ ఫ్రాడ్ కేసులతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించేందుకు దీనితో అత్యధికంగా అవకాశాలు ఉంటున్నట్లు ఫోన్‌పే గణాంకాల్లో వెల్లడైందని డాట్ పేర్కొంది. సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, చక్షు ప్లాట్‌ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లభించే వివరాల ప్రాతిపదికన మొబైల్ నంబర్లను ‘మధ్య స్థాయి’, ‘అధిక’, ‘అత్యధిక’ రిస్కుల కింద ఎఫ్ఆర్ఐ వర్గీకరిస్తుంది. ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్ఎయిర్టెల్ యూజర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీకస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌్రస్కిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డివైజ్‌లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.
ఫ్యామిలీ

అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్‌గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్‌గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్‌సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్

YASHODA AI జై.. యశోద ఏఐ
అంతంత మాత్రమే చదువుకున్న మహిళలను టెక్–సావీలుగా తీర్చిదిద్దవచ్చా? ‘అవును’ అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళల విజయాలే సాక్ష్యం.తాజాగా... దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను టెక్–సావీలుగా తీర్చిదిద్దడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ‘యశోద ఏఐ క్యాంపెయిన్’ మొదలైంది...నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ (ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ప్రత్యేకమైన క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్ ద్వారా లక్షలాది మహిళలకు డిజిటల్ లిటరసీప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. సైబర్ నేరాల బారిన పడకుండా మహిళలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో మహిళలను టెక్–సావీగా మార్చడానికి రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫులే యూనివర్శిటీలోప్రారంభమయ్యే ‘యశోద ఏఐ క్యాంపెయిన్’ (యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హరైజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్) ద్వారా రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీలో శిక్షణ ఇస్తారు.ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‘యశోద ఏఐ’ లక్ష్యం దేశంలోని ప్రతి మూలలో మహిళలకు సాంకేతిక విషయాల్లోప్రావీణ్యం కల్పించడం. తొలిదశలో రెండు లక్షల కంటే ఎక్కువమంది మహిళలకు సాంకేతిక విషయాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూల్, కాలేజి, స్వయంసహాయక బృందాలు, ఆశా వర్కర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా వివిధ వర్గాల మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి స్థానిక భాషల్లో కోర్సు మెటీరియల్ అందిస్తారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి డిజిటల్ టూల్స్ వాడకంపై అవగాహన కలిగిస్తారు.చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! చేంజ్ మేకర్స్గ్రామీణ, పట్టణప్రాంతం అని తేడా లేకుండా అంతంత మాత్రం చదువుకున్న అమ్మాయిలు కూడా సాంకేతిక విషయాల్లో ప్రావీణ్యం సాధించేలా చేయవచ్చని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్ని...ఒడిషాలోని రఘురాజ్‌పూర్ గ్రామానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల చంద్రమాకు నెలకు వెయ్యి రూపాయల ఆదాయం అనేది కష్టంగా ఉండేది. తన మాతృభాషలో మాట్లాడిన మాటలను సెల్ఫోన్లో రికార్డ్ చేయడం ద్వారా ఇప్పుడు నెలకు అయిదువేలు సంపాదిస్తోంది. బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కార్య’ కోసం పనిచేస్తోంది చంద్రమా. స్థానికభాషల్లో డేటాసెట్స్‌ను రూపొందించడంపై ‘కార్య’ దృష్టి పెట్టింది.కోల్‌కత్తాలోని గ్రామీణప్రాంతానికి చెందిన మౌమితా షా దాస్ రోజూ ఉదయాన్నే తన ఫోన్లో డిజిటైజింగ్ వర్క్ మొదలుపెడుతుంది. స్కూలుకు వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ డిజిటైజింగ్ వర్క్‌లోకి వెళుతుంది. ‘తక్కువ టైమ్ పని చేసినా మంచి ఆదాయం సంపాదిస్తున్నాను. ఈ డిజిటల్ టాస్క్‌ల ద్వారా నేను ఏ పని అయినా చేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌమిత.స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు...ఏఐ మోడల్స్‌ని ట్రైన్ చేయడంపై ఫోకస్ చేసే జాబ్స్‌లో హైరింగ్ పెరగడంతో గ్రామీణప్రాంతాలకు చెందిన చంద్రమా, మౌమితలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. వారు చేసే పనికి సాంకేతిక విద్యలో పట్టా అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, డిజిటల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.‘గ్రామీణప్రాంతాలలోని మహిళలు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్‌గా మారేలా శిక్షణ ఇస్తాం. మన దేశానికి సంబంధించిప్రాంతీయ భాషలలో ఏఐ మోడల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాం’ అంటున్నారు ‘కార్య’ సీయివో మనూ చోప్రా ఒకప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన రోమల దీదీ ఇలా అంటోంది. ‘కార్య ద్వారా నాకు వచ్చే డబ్బుతో పిల్లల బడిఫీజులు చెల్లిస్తున్నాను. ఇతర ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతోంది’.ఐ–సాక్ష్యమ్బిహార్కు చెందిన ‘ఐ–సాక్ష్యమ్’ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది యువతులను చేంజ్‌మేకర్స్‌గా మారుస్తోంది. నిజానికి వీరిలో చాలామందికి స్మార్ట్‌ఫోన్ గురించి తెలియదు. అలాంటి వారిని కూడా సాంకేతిక అంశాలలో పట్టు సాధించేలా, ఉపాధి పొందేలా చేస్తున్నారు. సాంకేతిక విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుండే లక్ష్యంతో ఐ–సాక్ష్యమ్ కృషి చేస్తోంది.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంత ప్రమాదకరమైనదా..? పాపం ఆ వ్యక్తి..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదంతాలు ఎన్నో జరిగాయి. అందులోనూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్.. ఏదైనా తేడాకొడితే..నేరుగా మన బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకుళంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అతడి జీవితాన్ని ఎంతలా నరకప్రాయంగా చేసిందో వింటే..నోటమాట రాదు. ఇంత ప్రమాదరకరమైనదా.. ?హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనిపిస్తుంది.49 ఏళ్ల సనీల్ తన లుక్ అందంగా మార్చుకోవాలనుకుని కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని ఇన్సైట్ డెర్మా క్లినిక్‌ని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి గురించి పూర్తిగా తెలుసుకునే యత్నం చేయకుండానే కేవలం ప్రకటనల ఆధారంగా సంప్రదించాడు. అయితే అక్కడ వైద్యులు అతడిని పరిశీలించి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలా అతడికి సదరు ఆస్పత్రి వైద్యులు చేద్దాం అనుకున్నా..నాలుగుసార్లు అనుకోని అవాంతరాలతో వాయిదా పడింది. అప్పుడైనా ఇలా ఎందుకు జరగుతుందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరి 2025లో ఒకరోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సమయాత్తమయ్యాడు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయినా తర్వాత నుంచి ఇన్ఫెక్షన్ల బారినపడ్డాడు. మార్చి 1 నాటికి, అతడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగుమచ్చలు, ఒక విధమైన స్రావాలు కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ సాధారణ సమస్యలే అని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపారు సనీల్కి. దీంతో ఆస్పత్రికి వచ్చినా..పరిస్థితి మెరుగుపడలేదు కదా..మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దాంతో సనీల్ శరీరంలో బీపీ, చక్కెరస్థాయిలు ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నరకయాతన భరించలేక అక్కడే సమీపంలో ఉన్న సనీల్ లౌర్డ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాక్ వద్దకు పంపారు. అక్కడ ఆయన సనీల్ పరిస్థితిని చూసి..మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు నిర్థారించారు. తక్షణమే సనీల్ని సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటివరకు పదమూడు సర్జరీలకు పైగా చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అత్యవసర శస్త్ర చికిత్స వంటి వాటితో పోరాడటమే ఏకైక మార్గం. ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తుందట. తన తలలో ఒక రంధ్ర ఏర్పడిందని..ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని అన్నారు. అంతేగాదు ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా..ఒక విధమైన స్రావాలు కారడంతో వాక్యూమ్-అసిస్టెడ్ డ్రైనేజ్ పంప్‌ను అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. దాన్ని కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్‌పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. అలాగే అందుకు బాధ్యులైన సదరు వైద్యులకు శిక్ష పడేదాక వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్. అతడిగాథ వింటే..అందానికి సంబంధించిన శస్త్రచికిత్సల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో చెప్పడమే గాక మనోగత అందానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయం చెప్పకనే చెబుతోంది.(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..)

రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్ వైరల్
200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్ జెట్ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
ఫొటోలు
అంతర్జాతీయం

భారత్‌కు అండగా ఉంటాం
అబుదాబీ/టోక్యో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), జపాన్ ప్రకటించాయి. భారత్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అరాచకాలను, ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేయడానికి ఏర్పాటైన అఖిలపక్ష బృందాలు తమ కార్యాచరణ ప్రారంభించాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం గురువారం యూఏఈ మంత్రి షేక్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, డిఫెన్స్ కమిటీ చైర్మన్ అలీ అల్ నుయామీతోపాటు ఇతర నేతలతో అబుదాబీలో సమావేశమైంది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో మరో బృందం జపాన్ రాజధాని టోక్యోలో జపాన్ విదేశాంగ మంత్రి తకాషీ ఇవాయాతోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారిందని అలీ అల్ నుయామీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మానవాళికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జపాన్ మంత్రి ఇవాయా మాట్లాడుతూ... ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్ఘాటించారు. మరోవైపు డీఎంకే ఎంపీ కె.కనిమొళి నేతృత్వంలోని మరో అఖిలపక్ష బృందం రష్యాకు బయలుదేరింది. మొత్తం 33 దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బంది ఇద్దరు హత్యకు గురయ్యారు. నార్త్ వెస్ట్ డీసీలోని యూదుల మ్యూజియానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో రాయబార సిబ్బంది అయిన సారా లిన్ మిల్గ్రిమ్, యారోన్ లిచిన్‌స్కీ అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికన్ యూదు అసోసియేషన్ ఇచ్చిన విందు నుంచి తిరిగి వెళ్తుండగా కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల అనంతరం నిందితుడు మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈవెంట్ సెక్యూరిటీ అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అని నినాదాలు చేశాడు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కాల్పుల్లో మరణించిన లిచిన్‌స్కీ రాయబార కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్ కాగా, మిల్గ్రిమ్.. ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న అమెరికా పౌరురాలు. వారిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెచియల్ లెయిటర్ తెలిపారు. వచ్చేవారం జెరూసలేంలో సారాకి ప్రపోజ్ చేయాలని యారోన్ ప్లాన్ చేసుకున్నారని, ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీచమైన ఉగ్రవాద చర్య: నెతన్యాహుఈ దాడిని అమెరికా, ఇజ్రాయెల్ నేతలు, అధికారులు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ దాడిని యూదు వ్యతిరేక, నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. యువ జంటను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ‘యూదు వ్యతిరేకతతో చేసిన హత్యలని స్పష్టమవుతోంది. ఇలాంటి హత్యలు ఇప్పుడే అంతం కావాలి. ద్వేషం, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు. బాధితుల కుటుంబాలకు నా సంతాపం. ఇలాంటివి జరగడం చాలా విచారకరం’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది హత్యను మేమూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరికితనం. యూదు వ్యతిరేక హింస. బాధ్యులను గుర్తించి న్యాయం ముందు నెలబడతాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రతినిధులు నిరంతరం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, అయినా ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి లొంగిపోదని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు.

ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్‌హౌస్‌కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్‌కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్‌లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్‌పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్‌ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్‌వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్‌ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు.

జనావాసంలో కూలిన చిన్న విమానం
శాన్ డియాగో: అమెరికాలోని శాన్ డియాగో శివారులోని జనావాసాల మధ్య గురువారం తెల్లవారుజామున చిన్న విమానం ఒకటి కూలింది. ఈ ఘటనలో పలువురు మృత్యువాతపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన శకలాలతోపాటు ఇంధనం పారబోసినట్లు పడి మండటంతో 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. మరో డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. జనావాసాలున్న చోట విమాన ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రిలో చేర్చామని, మరో ఇద్దరికి స్వల్పంగానే గాయాలయ్యాయన్నారు. కూలిన ప్రైవేట్ సెస్నా రకం విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, ఘటన సమయంలో అందులో ఎందరున్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని టెటెర్»ొరో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకునన ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని కల్నల్ జేమ్స్ జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది. అనంతరం టేకాఫ్ తీసుకున్న ఈ విమానం శాన్ డియాగోలోని మాంట్గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సి ఉందని సమాచారం. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుందన్నారు. విమానం పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలిపారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. కాగా, అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచుకురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు.
జాతీయం

హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి.

పట్టుబడ్డ హైటెక్ కాపీయింగ్
సిమ్లా: మోసగాళ్ల అతి తెలివితేటలు మామూలుగా లేవు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే ఉద్యోగ ఎంపిక పరీక్షలకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హరియాణా నుంచి సమాధానాలందించే ముఠా గుట్టు రట్టయింది. పరీక్ష రాసే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అమర్చుకున్న ఎల్రక్టానిక్ పరికరాలతో హరియాణాలోని జింద్‌లోని ముఠా జవాబులు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏం జరిగిందంటే.. అరుణాచల్‌లోని నవోదయ విద్యాలయ సమితిలోని బోధనేతర పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ ఈ నెల 18న ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు ఇటానగర్‌లోని వీకేవీ చింపు, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్ కేంద్రాల్లో ఆ రోజు సాయంత్రం ల్యాబ్ అటెండెంట్ పరీక్ష జరిగింది. కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాసే ఓ అభ్యర్థి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు, పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో ఆ విద్యార్థి వద్ద ఓ చిన్న ఎల్రక్టానిక్ పరికరం, అతి చిన్న మైక్రోఫోన్ దొరికాయి. ఈ పరీక్ష కేంద్రంలో సరిగ్గా ఇలాంటి ఉపకరణాలనే ధరించిన మొత్తం 23 మంది విద్యార్థులను పట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో విద్యార్థి పట్టుబడ్డాడు. ఇలాంటి సోదాల్లో మిగతా వాళ్లు బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆరా తీయగా ఉదయం పరీక్ష రాసిన వారివద్ద కూడా ఇలాంటి ఉపకరణాలున్నట్లు తేలింది. దీంతో, వారిని కూడా పట్టుకున్నామని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. వీరందరినీ సమీప హోటళ్లు, ఇళ్లలోనే అరెస్ట్ చేశామన్నారు. ‘ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో మోసపూరితంగా పరీక్ష రాస్తున్న మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని, 29 డివైజెస్‌ను స్వాదీనం చేసుకున్నాం వీరిలో చాలా మంది నేరాన్ని అంగీకరించారు’అని ఎస్పీ వివరించారు. ‘పరీక్ష రాసేందుకు సాయం చేస్తామంటూ ఓ ముఠా తమను నమ్మించిందని వీరు చెప్పారు. నిఘా నుంచి తప్పించుకునేందుకు ఎగ్జామ్ హాల్స్‌లో మారుమూల ప్రాంతాల్లో కూర్చోవాలని సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఎల్రక్టానిక్ పరికరాలను ఉపయోగించే తీరుపై వీరందరికీ ముఠా శిక్షణ ఇచ్చింది’అని ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌ను అండర్ వేర్లో దాచుకున్నారు. అతిచిన్న ఇయర్ ఫోన్‌ను బయటకు కనిపించని రీతిలో చెవి లోపల అమర్చారు. ముందుగా వీరు తమకందించిన క్వశ్చన్ పేపర్ సెట్ పేరు ఏ, బీ, సీ, డీల్‌లో ఏదో అవతలి వారికి చెప్పాలి. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే వరకు ఎదురు చూడాలి. దగ్గితే సమాధానం అడిగినట్లు అర్ధం. అప్పుడు అవతలి వ్యక్తి సమాధానం చెప్తాడు’అని ఎస్పీ రాకెట్ వివరాలను వెల్లడించారు. మొత్తమ్మీద పరీక్ష పత్రం కూడా లీకై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్, సిక్కిం, దిమాపూర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లోనూ ఇలాంటి మతలబే జరిగినట్లు గుర్తించామన్నారు. ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోందని వివరించారు. పట్టుబడిన 53 మందిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరికి సాయం అందించిన వారిని, ముఠా సూత్రధారిని కనుక్కునేందుకు హరియాణా పోలీసుల సాయం కోరామని వివరించారు.

వృద్ధుడి పిత్తాశయంలో 8 వేల రాళ్లు
న్యూఢిల్లీ: ఓ వృద్ధుడి పిత్తాశయంలో ఒకటీరెండూ కాదు ఏకంగా 8,125 రాళ్లు బయటపడిన అరుదైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడొకరు కొన్నేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆకలి మందగించడం, తరచూ జ్వరం బారినపడటం, ఛాతీ, వెన్నెముక భాగంలో బరువుగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో, ఈ నెల 12వ తేదీన గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు తీసుకువచ్చారు. అల్ట్రా సౌండ్ పరీక్ష చేయగా పిత్తాశయ భాగమంతా రాళ్లతో నిండిపోయి కనిపించింది. దీంతో, వెంటనే లాపరోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గంటసేపట్లో శస్త్ర చికిత్స పూర్తయింది. అందులో వచ్చిన 8,125 రాళ్లను లెక్కించేందుకు వైద్య సిబ్బందికి ఏకంగా ఆరు గంటలు పట్టిందని ఆస్పత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కొలెస్టరాల్ అసమతౌల్యం కారణంగా గాల్‌స్టోన్స్ ఏర్పడుతుంటాయి. వీటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే ఇవి పెరిగిపోయే ప్రమాదముంది. ఈ కేసులో రోగి శస్త్రచికిత్సకు నిరాకరిస్తూ చాలాకాలంపాటు తాత్సారం చేశారని ఆస్పత్రి తెలిపింది. పరిస్థితి మరీ విషమించాకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆపరేషన్‌కు అంగీకరించారని పేర్కొంది. ఆపరేషన్ తర్వాత రెండు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జి చేశామని వెల్లడించింది. ఇప్పటికీ సర్జరీ చేయకుంటే అక్కడ చీము పేరుకుపోయి గట్టిపడి, పిత్తాశయం గోడలు మందంగా తయారవుతాయని, ఆ భాగంలో క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం సైతం ఉంటుందని గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ ఆంకాలజీ వైద్యుడు అమిత్ జావెద్ చెప్పారు. దేశ రాజధాని ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో పిత్తాశయంలో రాళ్లు బయటపడటం ఇదే మొదటిసారి కావచ్చని ఫోర్టీస్ ఆస్పత్రి తెలిపింది. అసాధారణమైంది కానప్పటికీ ఇది అరుదైన కేసని పేర్కొంది.

తాము శక్తికి ప్రతిరూపమని నిరూపించుకున్నారు
అఖూ్నర్ (జమ్మూ కశ్మీర్): ఆపరేషన్ సిందూర్‌లో మహిళా దళాల పాత్రను బీఎస్ఎఫ్ డీఐజీ వరీందర్ దత్తా కొనియాడారు. మహిళలు తాము శక్తికి ప్రతిరూపమని నిరూపించుకున్నారని ఆయన ప్రశంసించారు. పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడుల సందర్భంగా అఖూ్నర్లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లోని మహిళా సైనికులు పురుష సైనికులతో భుజం భుజం కలిపి నిలిచారన్నారు. ‘‘మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. శత్రువు మా పోస్టులపై దాడి చేయడం ప్రారంభించిన వెంటనే, మేం కాల్పులు జరిపాం. వారి ఎనిమిది ఫార్వర్డ్ పోస్టులను ధ్వంసం చేశాం. ఒక లాంచింగ్ ప్యాడ్‌తో పాటు వారి వైమానిక నిఘా వ్యవస్థను కూడా ధ్వంసం చేశాం. మా మహిళా కంపెనీ కమాండర్ ఒక శత్రు పోస్టును పూర్తిగా ధ్వంసం చేశారు’అని వరీందర్ దత్తా చెప్పారు. మహిళా సైనికులు అనే పదాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సాంబాలో ఓ బీఎస్ఎఫ్ అధికారి అన్నారు. యూనిఫాంలో ఉన్న పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని నిరూపించారన్నారు. స రిహద్దు కాల్పులు పెరిగినప్పుడు, మహిళా అధికారులను బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని అవకాశం ఇచి్చనా.. వారు సరిహద్దుల్లోనే విధులు కొనసాగించారని వెల్లడించారు. అంతేకాదు.. పా కిస్తాన్ కాల్పుల విరమణ ముసుగులో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. మే 8న జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో 45–50 మంది ఉగ్రవాదులు చొరబాటుకు దోహదపడేందు కు ప్రయతి్నంచిందని, బీఎస్ఎఫ్ భారీ మో రా్టర్ కాల్పులను ఉపయోగించి శత్రు పోస్టులను ధ్వంసం చేసి, చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. షెల్లింగ్‌ను సైతం బీఎస్ఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మాండ్ తెలిపారు.
ఎన్ఆర్ఐ

డబ్లిన్‌లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.