క్వాడ్‌ సదస్సుకు అమెరికా ఆతిధ్యం | First In Person Quad Summit To Be Hosted By Biden Next Week | Sakshi
Sakshi News home page

క్వాడ్‌ సదస్సుకు అమెరికా ఆతిధ్యం

Published Tue, Sep 14 2021 11:11 AM | Last Updated on Tue, Sep 14 2021 11:38 AM

First In Person Quad Summit To Be Hosted By Biden Next Week - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బెడెన్‌ సెప్టెంబర్‌ 24న జరగనున్న క్వాడ్‌ సదస్సుకి ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ యోషిహిడే సాగా పాల్గొంటారని అమెరికా స్వేత సౌధం ప్రకటించింది.

(చదవండి: Ola Future Factory: అక్కడ అంతా మహిళా ఉద్యోగులే)

ఈ సదస్సులో కోవిడ్‌ మహమ్మారీతో బాధపడుతున్న దేశాలు, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్‌ దేశాల బహిరంగ స్వేచ్ఛ, సాంకేతికత, సైబర్‌ స్పేస్‌లో భాదస్వామ్యం, తదితర అంశాల పై ఆచరణాత్మక సహకారం గురించి చర్చించనున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ తెలిపారు.

ఈ మేరకు తొలి క్వాడ్‌ నాయకుల శిఖరాగ్ర సదస్సు గత మార్చి నెలలో వర్చువల్‌ ఫార్మేట్‌లో జరిగిన సంగతి తెలిసిందే.  ఆ  సదస్సులో ఇండో పసిఫిక్‌ దేశాల స్చేచ్ఛ అనేది ప్రజాస్వామ్య విలువలతో ముడిపడిన అంశంగా చైనాకు పరోక్షంగా చెప్పకనే చెప్పింది. వనరులు అధికంగా ఉన్న దక్షిణ  చైనా సముద్రంలో చైనా దూకుడు ప్రవర్తన గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు జెన్‌ సాకీ పేర్కొన్నారు.

(చదవండి: సియాచిన్‌ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement