ఒంగోలు వన్‌టౌన్: ఈనెల 5, 6వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నాస్కామ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైమ్ కెరీర్ ఫెయిర్ జాబ్‌మేళాను గీతం యూనివర్శిటీ, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జే రవితేజ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిప్లమో, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి 40కి పైగా బహుళ జాతీయ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 3వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు ప్లేస్‌మెంట్ అధికారి ఎస్‌కె బాషాను 8125215216 అనే నంబరుపై సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment