భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్‌పేట్ బీట్‌లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్‌లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్‌జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్‌పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్‌జోన్ ఎఫ్‌ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment