‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్‌క్వార్టర్‌లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్‌లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్‌కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్‌లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌ను ఎస్పీ అభినందించారు.
ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా
సభ్యులపై కేసు
పోలీసుల అదుపులో ఐదుగురు
నిందితులు
2,125 పాత మొబైళ్లు,
107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment