సంతనూతలపాడు: మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య వర్ధంతిని స్థానిక పీర్లమాన్యంలో సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మాబు, నాయకుడు షేక్ కాలేషా, జిల్లా కమిటీ సభ్యుడు బంకా సుబ్బారావు, మండల కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి, శాఖ కార్యదర్శి కోడూరి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
హెచ్‌ఎం ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కారం
సంతనూతలపాడు: స్థానిక అంబేడ్కర్‌నగర్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం చుంచు రామాంజనేయులు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, మండవ మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, ఉపాధ్యాయురాలు టి.విద్యాశ్రీ, ఒంగోలు డిప్యూటీ డీఈవో ఏ చంద్రమౌలేశ్వర్, ఎంఈఓ డి.వెంకారెడ్డి, సంతనూతలపాడు హైస్కూల్ హెచ్‌ఎం ఎం.ప్రమోద, ట్రస్ట్ అడ్‌వైజర్ మండవ సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
మద్దిపాడు: మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మద్దిపాడు పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. మండల పరిధిలోని గుండ్లాపల్లి పారిశ్రామికవాడ సమీపంలో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై శివరామయ్య అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను మద్దిపాడు స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం ట్రాక్టర్ల డ్రైవర్లను తహసీల్దార్ సుజన్‌కుమార్ ముందు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment