పరామర్శించిన చుండూరి
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇన్‌చార్జిని
ఒంగోలు వన్‌టౌన్: వైఎస్సార్ సీపీ ఒంగోలు 13వ డివిజన్ ఇన్‌చార్జి ఎం.సూర్యరాజేష్‌ను ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు శుక్రవారం పరామర్శించారు. రాజేష్ తల్లి ప్రమీల అనారోగ్యంతో ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. శుక్రవారం కబాడిపాలెంలోని సీఈ సొసైటీ కమ్యూనిటీ హాలులో ఆదరణ స్తుతి కూడిక నిర్వహించగా, చుండూరితో పాటు పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కార్పొరేటర్లు గంగవరపు ప్రవీణ్, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, కోఆప్షన్ సభ్యులు శ్యామ్‌సాగర్, 9వ డివిజన్ ఇన్‌చార్జి పూర్ణచంద్రరెడ్డి, 10వ డివిజన్ ఇన్‌చార్జి శ్రీనివాసరావు, 16వ డివిజన్ ఇన్‌చార్జి భాస్కర్, 33వ డివిజన్ ఇన్‌చార్జి జేమ్స్, 36వ డివిజన్ ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి, 47వ డివిజన్ ఇన్‌చార్జి చావలి శ్రీను, 49వ డివిజన్ ఇన్‌చార్జి సుబ్బారావు, దళిత సంఘాల నాయకుడు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.
బాణసంచా తయారీ కేంద్రం తనిఖీ
మద్దిపాడు: మద్దిపాడులోని బాణసంచా తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించారు. మందుగుండు సామగ్రి తయారు చేయడానికి ఉపయోగించే ముడిసరుకు గురించి, ఆ ముడిసరుకు కలిపే సమయంలో పేలుడు సంభవించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తయారీదారులను ఆరా తీశారు. తయారైన బాణసంచా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన గోడౌన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా తయారీదారులు లైసెన్స్ రెన్యువల్ చేయించేందుకు అర్జీ ఇచ్చిన నేపథ్యంలో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీవో.. రీ సర్వే జరుగుతున్న విధానంపై చర్చించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు లేకుండా సర్వే నిర్వహించరాదని సూచించారు. ప్రతిఒక్కరికీ విడివిడిగా ఎల్పీఎం నంబర్లు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజన్‌కుమార్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, ఆర్‌ఐ రమణయ్య, వీఆర్వో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్‌రాజును ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం తన చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రిటైర్‌మెంట్ అనేది కేవలం ఉద్యోగానికే అని, జీవితానికి కాదని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి విజయవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు. కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్‌ఐ తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరామర్శించిన చుండూరి
పరామర్శించిన చుండూరి
Comments
Please login to add a commentAdd a comment