ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
చీమకుర్తి రూరల్: పెద్దలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండలంలోని బండ్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అఫ్సర్ సూచించారు. శుక్రవారం మండలంలోని గాడిపర్తివారిపాలెం సచివాలయం పరిధిలో గల రంగసాయిపురం విలేజ్ హెల్త్ క్లినిక్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. 40 సంవత్సరాల తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని, ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించి విలేజ్ హెల్త్ క్లినిక్లో చూపించుకోవాలని సూచించారు. అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్లో 59 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల వద్దకెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని ఉచితంగా మందులు అందజేసి సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు, హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శికి సన్మానం
సంతనూతలపాడు: మండలంలోని గురువారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి జెట్టి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా వారి దంపతులను ఎంపీడీవో డి.సురేష్‌బాబు, ఎంపీపీ బుడంగుంట విజయ, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, పంచాయతీ కార్యదర్శుల సంఘ మండల అధ్యక్షుడు ఎన్.ప్రతాప్ కుమార్ తదితరులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
Comments
Please login to add a commentAdd a comment