
టీచర్ల సస్పెన్షన్ ఎత్తివేయాలి
మోడల్ స్కూల్‌లో ముగ్గురు టీచర్లు విద్యార్థులను వేధింపులకు గురిచేసినట్లుగా జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. వైరల్‌గా మారిన సదరు టీచర్లు, తమ పిల్లలతో కూడిన ఫొటోలపై తామెలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వారంటే గిట్టని టీచర్లు వాటిని వైరల్ చేసి మీకు ఫిర్యాదు చేశారు. వారి సస్పెన్షన్‌తో విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారు. పునర్విచారణ జరిపించి సస్పెన్షన్ ఎత్తివేయాలి.
– విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బజార్‌హత్నూర్