
సాక్షి, హైదరాబాద్: అన్ని రకాల అలర్జీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జెరాత్ పాథ్ ల్యాబ్స్, అలర్జీ టెస్టింగ్ సెంటర్ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 80 నుంచి 130 అలర్జీలకు సంబంధించిన పరీక్షలను 50 శాతానికి పైగా రాయితీతో చేయనున్నట్లు పేర్కొంది. జూలై 2, 3, 4, 5వ తేదీల్లో ఈ కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. అలర్జీ పరీక్షలతో పాటు థైరాయిడ్, కిడ్నీ, లివర్, కీళ్లు, లిపిడ్, ఎలక్ట్రోలైట్స్ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment