ఈసారి జ్ఞాపకాలే.. | - | Sakshi
Sakshi News home page

ఈసారి జ్ఞాపకాలే..

Dec 4 2024 1:43 AM | Updated on Dec 4 2024 1:43 AM

ఈసారి

ఈసారి జ్ఞాపకాలే..

ఈ ఏడాది విశాఖకు దూరంగా నేవీ డే వేడుకలు

కళతప్పిన

సాగరతీరం

టా నవంబర్‌ మూడో వారం నుంచి విశాఖ సాగర తీరంలో నేవీ డే సందడి కనిపించేది. రెండు వారాలు ముందుగానే యుద్ధ విన్యాసాలు, నౌకలు విశాఖ సాగర జలాల్లో దర్శనమిచ్చేవి. కానీ ఈసారి నేవీ డే వేదిక పూరీకి మారడంతో ఇక్కడ సందడే లేకుండా పోయింది. నేవీ డే ముందు నిర్వహించే రిహార్సల్‌ను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు, పర్యాటకులకు విశాఖ సాగర తీరానికి వస్తుండేవారు. ఈసారి అటువంటి పరిస్థితి లేదు.

ఐదు దశాబ్దాలకు పైగా..

1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభా పాటవాలు, వ్యూహాలు, ధైర్యసాహసాలకు గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆ రోజున తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సాగర తీరంలో భారత నౌకాదళ సామర్థ్యాలను ప్రదర్శించేవారు. ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలు ఈ ఏడాది మనకు కనిపించవు. ఇన్నాళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ఈ వేడుకలను రద్దు చేశారు. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ మరణించిన సమయంలోను, 2020లో కోవిడ్‌ కారణంగా వేడుకలను నిర్వహించలేదు.

ఈసారి జ్ఞాపకాలే..1
1/1

ఈసారి జ్ఞాపకాలే..

Advertisement
 
Advertisement
Advertisement