
5న ఫీజు పోరు దీక్ష
పాడేరు : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేశారన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇందుకు నిరసనగా ఈనెల 5న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన పాడేరులో ఫీజు పోరు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, సర్పంచ్‌లు గొల్లోరి నీలకంఠం, కుర్రబోయిన సన్నిబాబు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తెడబారికి సురేష్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు పాంగి నాగరాజు, కుంతూరు బొంజుబాబు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తమర్భ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు పలాసి రామారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు
విజయవంతం చేయాలని పిలుపు
Comments
Please login to add a commentAdd a comment