కొయ్యూరు: రక్తదానం ఆపదలో ఉన్న ఎందరికో ప్రాణదానం చేస్తుందని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధ అన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. డిగ్రీ కళాశాలలో కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు రెడ్‌క్రాస్ సొసైటీ, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 70 మంది వరకు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో ఎస్.కె.వి.ప్రసాద్ మాట్లాడుతూ యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పాడేరు వైద్యులు కె.జె.రాఘవేంద్ర, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి గౌరి శంకర్, వైస్ చైర్మన్ గంగరాజు, సభ్యులు రాజు, వీఆర్‌వో కుమారి, డౌనూరు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


