సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో అనుబంధ విభాగాలకు అధ్యక్షు లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఆవుల మరియాదాస్(రంపచోడవరం),ఎస్టీసెల్ అధ్యక్షుడిగా కుంజెం మురళీ(రంపచోడవరం),మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ కాజావలీ(రంపచోడవరం), విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లోచలి వరప్రసాద్(పాడేరు),ఆర్‌టీఐ విభాగం అధ్యక్షుడిగా బొడ్డు సత్యనారాయణ(రంపచోడవరం),వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కోట్ల కృష్ణ(రంపచోడవరం),సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా జంపరంగి విజయ్‌కుమార్(పాడేరు), దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా వనగల వెంకటేశ్వర్లు(పాడేరు),డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా గండేరు చినసత్యం(అరకులోయ),బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా చింతపల్లి దుర్గా రఘనాఽథ్(రంపచోడవరం) నియమితులయ్యారు.
పాడేరు నియోజకవర్గంలో
మండలాల అధ్యక్షులు వీరే
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులను నియమించారు. చింతపల్లి మండల అధ్యక్షుడిగా పాంగి గణబాబు, జి.మాడుగుల మండల అధ్యక్షుడిగా నుర్మాని మత్స్యకొండంనాయుడు, జీకే వీధి మండల అధ్యక్షుడిగా కంకిపాటి గిరిప్రసాద్,కొయ్యూరు మండల అధ్యక్షుడిగా బిడిజాన అప్పారావు,పాడేరు మండల అధ్యక్షుడిగా సీదరి రాంబాబును నియమించారు.


