అంబరాన్నంటిన అమాస సంబరాలు
నూకాలమ్మ దేవాలయాల్లో భక్తులు వేకువజామునుంచే ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం నూకాలమ్మ ఉత్సవ విగ్రహం, ఘటాలను ఘనంగా ఊరేగించారు.
జి.మాడుగుల: మండలంలో బొయితిలి,మద్దిగరువు గ్రామాల్లో శనివారం రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. మద్దిగరువు నుంచి అమ్మవారి ఘటాలను ఉత్సవ కమిటీ అధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో పెదబయలు మండలం కుంటిమామిడి గ్రామ సమీపాన గల రాస గుహలో కొలువై ఉన్న రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి సన్నిధికి చేర్చి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.ఆంధ్ర–ఒడిశా రాష్ట్ర సరిహద్దు గిరిజన గ్రామాలను నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా ధారాలమ్మ జాతర
సీలేరు:ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం ఘాట్‌రోడ్డులోని ధారాలమ్మ అమ్మవారి ప్రధాన పండగ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పండగ నెల 20న ప్రారంభమైంది. ఒడశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రాలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆలయ ఈవో సాంబశివరావు ధారకొండ గ్రామానికి చెందిన భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, దూప దీప నైవేద్యాలను సమర్పించారు.ఈ సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ మహాద్వారాన్ని మూసివేశారు. మళ్లీ ఉగాది రోజు ఉదయం ఆలయ తలుపులు తెరవనున్నట్టు ఈవో తెలిపారు.మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
● సీలేరు జల విద్యుత్ కేంద్రం వద్ద నూకాలమ్మ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.విజయవాడకు చెందిన జెన్‌కో ఇంజినీరు బుద్ధాన రమేష్ కుమార్ దంపతులు అమ్మవారికి చీర,సారె సమర్పించారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మంగళవారం మరుపూజ చేసేందుకు కమిటీసభ్యులు ఏర్పాట్లు చేశారు.
రాజవొమ్మంగి: కొత్త అమావాస్య సందర్భంగా రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి దర్శనం కోసం శనివారం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారికి పసుపు కుంకుమలు, పిండివంటలు, పూలు, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించారు. గత రెండు రోజులుగా గ్రామదేవత సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గరగనృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట గుళ్లు, జానపద నృత్యాలు ఆకట్టుకొంటున్నాయి.
Iవ పేజీ తరువాయి
అంబరాన్నంటిన అమాస సంబరాలు
అంబరాన్నంటిన అమాస సంబరాలు
అంబరాన్నంటిన అమాస సంబరాలు


