వై.రామవరం: సరిహద్దు అటవీ ప్రాంతం(ఏవోబీ)లో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒకపక్క సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వరుస ఎన్‌కౌంటర్లు, మరో పక్క వై.రామవరం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోను ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులపై గట్టి నిఘాఉంచారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.


