ఘనంగా ఉగాది సంబరాలు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని మోదకొండమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ దినేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వనల చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పంచాంగకర్త వేదుల సాయిప్రశాంత శర్మ సంవత్సర ఫలితాలను వివరించారు. వర్షాలు పుష్కలంగా కురిసి, పాడి పంటలతో జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంద ని చెప్పారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడు తూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలో వర్షాలు కురిసి గిరిజన రైతులు సాగు చేసే అన్ని పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.ఉగాది వేడుకలు ఘనంగా జరగడంతో పాటు కవి సమ్మేళనం ఆసక్తిగా జరగడం సంతోషంగాఉందన్నారు.తెలుగు భాషాభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.అనంతరం కలెక్టర్ పలుపద్యాలను వినిపించి,వాటి అర్థాలను వివరించారు.
అర్చకులకు ఘనంగా సత్కారం
ఉగాది సందర్భంగా పలువురు అర్చకులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.అరకులోయ వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు బాలగణేష్,సూకురుపుట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ అర్చకుడు రామకృష్ణ పరమహంస,వంతాల,రాయిగెడ్డ రామాలయాల అర్చకుడు వంతాల అప్పలనాయుడు,కించే సత్యనారాయణలకు రూ.10,116 చొప్పున ఆర్థిక సాయం చెక్‌లను అందజేసి,దుశ్శాలువాలతో సన్మానించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న మహిళలను కలెక్టర్ సన్మానించారు. సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,డీఆర్‌వో పద్మలత,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ,సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి,డీఆర్‌డీఏ పీడీ మురళీ,జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌కుమార్‌రావు,డ్వామా పీడీ విద్యాసాగర్,ఏపీఎంఐపీ పీడీ రహీం,తహసీల్దార్ వి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉగాది సంబరాలు


