ఇద్దరు యువకులను కాపాడిన మైరెన్ పోలీసులు
ఎస్.రాయవరం: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన యువకులు,నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం గ్రామానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆదివారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. తీరంలో స్నానం కోసం అన్నదమ్ములైన బర్ల బాలు, గోపిలు సముద్రంలోనికి దిగారు. పెద్ద కెరటం రావడంతో మునిగిపోయారు. ఒడ్డున గస్తీ కాస్తున్న మైరెన్ ఏఎస్‌ఐ ఎం.కృష్ణ,కానిస్టేబుల్ పి.చినబాబు.హెచ్‌జిలు అప్పలకొండ, జగన్నాథం వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సకాలంలో మైరెన్ పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యువకులను కాపా డిన మైరెన్ పోలీసులను పెంటకోట పోలీస్‌స్టేషన్ మైరెన్ సీఐ మురళి అభినందించారు.


