గురువుతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం
పెదబయలు: గురువులను ఆశ్రయించి సాధన చేస్తేనే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడం సాధ్యమవుతుందని సద్గురువులు రావడి యోగేంద్ర స్వామి, బుక్కా రాజనంద స్వామి అన్నారు. మండలంలోని గోమంగి పంచాయతీ సరియాపల్లి, కుమ్మరివీధి గ్రామాల మధ్య ఆదివారం జరిగిన 77వ ఆదివాసీ గిరిజన వేదాంత తత్వప్రబోధాలు కార్యక్రమంలో తత్వమసిపై ప్రవచించారు. ముందుగా అఖండ జ్యోతిని ప్రజ్వలన చేశారు. గురువుపాదాలు పట్టుకుని జీవనం సాగిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఈ తత్వప్రబోధాలు సాగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి జర్ర అప్పారావు మాట్లాడుతూ దైవ భక్తి ఉన్నవారు ప్రేమ, దయ,జాలి, కరుణ,మానవత్వంతో జీవితం సాగిస్తారని చెప్పారు.
సామూహిక కుంకుమార్చన
ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం గోమంగిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవచనాలు, హరి భజనలు, బ్రహ్మోపదేశాలు నిర్వహించారు. అనంతరం గురువులను దుశ్శాలువాలతో సన్మానించారు. మహిళలు నిర్వహించిన కోలాటం, థింసా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సద్గురువులు కుంబిడి సత్యానంద స్వామి,లోచలి భగీరానంద స్వామి, సభాధ్యక్షులు దేపూరు వెంగలయ్య, మాజీ జెడ్పీటీసీ కొంట సూర్యనారాయణ,వైస్ సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గురువుతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం
గురువుతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం
గురువుతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం


