7,135 పనులు .. రూ.626.16కోట్లు
జిల్లాలో నీరుగారుతున్న పథకం
గత ప్రభుత్వ హయాంలో 3,503 పనులు పూర్తి
కూటమి ప్రభుత్వంలో ముందుకుసాగని వైనం
గ్రామాల్లో తప్పని తాగునీటి వెతలు
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులు జిల్లాలో పడకేశాయి. ఈ పథకం వల్ల తాగునీటి వనరుల సద్వినియోగం, తలసరి నీటి వినియోగ పరిమాణం పెంపుదల, నూరుశాతం రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల పథకం ఉద్దేశమే నీరుగారుతోంది. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సక్రమంగా చేయడం లేదని తెలిసింది.
సాక్షి,పాడేరు/అరకులోయ టౌన్/రంపచోడవరం: జల్‌జీవన్ పథకంతో సురక్షితమైన తాగునీరందుతుందని భావించిన జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఇంటింటికీ కుళాయిల ద్వారా 22 మండలాల పరిధిలో 2,40,057 కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభమైన జల్‌జీవన్ మిషన్.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నీరుగారుతోంది. పలు గ్రామాల్లో పనులు ఇంకా ప్రారంభం కాకపోగా, ఇప్పటికే ప్రారంభమైన పనులకు చాలా చోట్ల బ్రేక్ పడింది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పథకాలు గిరిజనులకు తాగునీరు అందిస్తుండగా, కూటమి ప్రభుత్వంలో ఈ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాడేరు,రంపచోడవరం,అరకులోయ నియోజకవర్గాల్లో జల్‌జీవన్ మిషన్ తాగునీటి పథకాల నిర్మాణాలకు నిధులు సమస్య అధికంగా ఉందని కాంట్రాక్టర్లు తెలిపారు.
జల్ జీవన్‌లో.. నిర్లక్ష్య ధారలు
జల్ జీవన్‌లో.. నిర్లక్ష్య ధారలు
జల్ జీవన్‌లో.. నిర్లక్ష్య ధారలు


