మర్యాదపూర్వక కలయిక
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను ఎమ్మెల్యే పార్టీ అధినేతకు సమగ్రంగా వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకపాలనను ఎండగడుతూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని మాజీ సీఎం జగన్ ఆదేశించినట్టు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విలేకరులకు తెలిపారు.


