జీడిమామిడి పిక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
రంపచోడవరం: గిరిజన రైతులు జీడిమామిడి పిక్కలను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవీ అన్నారు. పందిరిమామిడి సెంటర్‌లో బుధవారం వన్‌దన్ వికాస కేంద్రాన్ని ప్రారంభించారు.రంపచోడవరం కేంద్రంగా జీడిమామిడి పిక్కలు ప్రొసెసింగ్ సెంటర్ కోసం అంసెబ్లీలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఐటీడీఏ పీవో సింహాచలం మాట్లాడుతూ ఏజెన్సీలో పరిధిలో 114 వన్‌దన్ వికాస కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే 14 జీడిమామిడి పిక్కల ప్రొసెసింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వంద మెట్రిక్ టన్నుల జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేసి ప్రొసెసింగ్ అనంతరం మార్కెటింగ్ చేయడమే లక్ష్యమన్నారు. పది మెట్రిక్ టన్నుల చింతపండు, 20 మెట్రిక్ టన్నుల పసుపు, లక్ష కొండ చీపుళ్లు కొనుగోలు చేసి మార్కెట్‌కు తరలించనున్నుట్టు చెప్పారు. వీడీవీకెల అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. వెలుగు ఏపీడీ డేగలయ్య, డీపీఎం అపర్ణ, పరమేశ్వరరావు, ఏపీఎం రాము తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం


