‘ఉన్నతి’తో ఉపాధి అవకాశాలు
కొయ్యూరు: ఉన్నతి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చింతపల్లి క్లస్టర్ ఉపాధిహమీ పథకం ఏపీడీ లాలం సీతయ్య తెలిపారు. ఈ పథకం కింద 90 రోజుల శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 100 పనిదినాలు పూర్తి చేసుకున్న వేతనదారుల పిల్లల కోసం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జాబ్స్ కోఆర్డినేటర్ వై.లక్ష్మి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అప్పలరాజు తదితరులు మాట్లాడారు.


