భూములు కోల్పోయాం.. న్యాయం చేయండి
విజయనగరం అర్బన్: ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు, డుంబ్రిగుడ మండలాలకు చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావుకు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి సమస్యను తెలియజేశారు. తమకు నష్టపరిహారం, ఉపాధి కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. భూమికి భూమి ఇచ్చేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు గిరిజనుల వినతి


