సీతారామ్
జై శ్రీరామ్.. జై శ్రీరామ్
పట్టువస్త్రాలను సమర్పిస్తున్న చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్
సీతమ్మవారి విగ్రహాన్ని భక్తులకు చూపుతున్న అర్చకుడు
మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు
వీఆర్‌పురం: పుణ్య గోదావరి, శబరి నదుల
సంగమ ప్రాంతానికి సమీపాన గల రామగిరి జనసందోహంతో నిండిపోయింది. మాతంగ మహర్షి నిర్మించిన శ్రీసుందర సీతారామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగవైభవంగా సాగిన సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. భక్తుల జయ జయ ధ్వానాలు.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ.. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం అభిజిత్ లగ్నంలో శ్రీ సుందర సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొండపైగల అంతరాలయంలో స్వామి మూలమూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారీగా ఊరేగింపు
కల్యాణోత్సవం సందర్భంగా రామయ్యను, సీతమ్మను భారీ ఎత్తున ఊరేగించారు. గిరిజన సంప్రదాయ నృత్యం డోలుకొయ్యలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సమూర్తులను కొండ మీద నుంచి ఊరేగింపుగా పల్లకీలో కొండదిగువన ఉన్న మండపానికి తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ , ఆలయకమిటీ చైర్మన్ సుదర్శనరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు సమర్పించారు. ఏఎస్‌డీఎస్ డైరెక్టర్ ఉండవల్లి గాంధీ బాబు మంగళసూత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పీటీసీ వాళ్ల రంగారెడ్డి, స్థానిక సర్పంచ్ పులిసంతోష్ కుమార్, ఓఎస్‌డీ జగదీష్, సీఐ దుర్గాప్రసాద్, కూనవరం, వీఆర్ పురం ఎస్‌ఐలు సంతోష్‌కుమార్, లతశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో సుమారు 40 వేల మంది భక్తులు పాల్గొన్నట్టు అంచనా.
భక్తుల కోసం ప్రత్యేక లాంచీలు
ఏలూరు జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం గోదావరి ఆవల ఒడ్డున రేపాక గొమ్ము నుంచి లాంచీలను ఏర్పాటు చేశారు.
భక్తుల సేవలో..
కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల కోసం పలువురు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు, బెల్లం పానకం పంపిణీ చేశారు. బోటు యూనియన్ సభ్యులు మజ్జిగ పంపిణీ చేశారు. భద్రాచలం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు 10 వేల మందికి అన్నసమారాధ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.
రమణీయం రాములోరి
కల్యాణం
జై శ్రీరామ్ నినాదాలతో శ్రీరామగిరి మార్మోగింది.. శ్రీరామ నవమి సందర్భంగా మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీరామగిరిలో అశేష భక్తజనం నడుమ శ్రీ సుందర సీతారాచంద్రస్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. తనివి తీరా వీక్షించిన భక్తులు తమ కనులదే భాగ్యమంటూ ఉప్పొంగిపోయారు. జై శ్రీరామ్...జై శ్రీరామ్.. సీతారాం అన్న నామస్మరణలతో రామగిరి ప్రతిధ్వనించింది.
రామగిరికి
భారీగా
తరలివచ్చిన
జనం
కల్యాణ
ఘట్టాలను
తిలకించి
పులకించిన
భక్తులు
సీతారామ్
సీతారామ్
సీతారామ్


