బండరాయిని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిద్రమత్తులో మితిమీరిన వేగంతో బైక్‌ను నడపడం వల్ల అదుపు తప్పి పెద్దబండరాయిని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ మండలం బొండం పంచాయతీ రంగినిగూడ గ్రామానికి చెందిన కిల్లో గోవింద్,సిరగం రాంబాబు,సువాభి గణేష్ మండలంలోని దొడిపుట్టు పంచాయతీ కేంద్రంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఆదివారం రాత్రి శ్రీరామనవమి జాతరను తిలకించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్వగ్రామం రంగినిగూడకు బయలుదేరారు.దొడిపుట్టు నుంచి కిలో మీటరు దూరం వచ్చేసరికి నిద్రమత్తులో ఉండడంతోపాటు అతివేగంగా బైక్‌ను నడపడంతో అదుపు తప్పింది. రోడ్డు పక్కన గల పెద్దబండ రాయిని బైక్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న సువాభి గణేష్(36) తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సిరగం రాంబాబు,వెనుక ఉన్న కిల్లో గోవింద్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో హూటాహూటిన వారిని ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.వైద్యాధికారి గీతాంజలి క్షతగాత్రులకు వైద్య సేవలందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు పంపారు. మృతుడు గణేష్ తండ్రి సువాభి సింహా చలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
ఇద్దరికి తీవ్రగాయాలు
నిద్రమత్తు, అతివేగం వల్ల ప్రమాదం
బండరాయిని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
బండరాయిని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి


