ఎమ్మెల్సీ గాదె దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ గాదె దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు

Apr 9 2025 1:30 AM | Updated on Apr 9 2025 1:30 AM

ఎమ్మెల్సీ గాదె దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు

ఎమ్మెల్సీ గాదె దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు

డుంబ్రిగుడ: మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఏడీ, ఐఆర్‌ ప్రకటించే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ బకాయి ఉన్న పీఆర్‌సీ విడుదల చేసే విధంగా కృషి చేయాలని నూతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్‌నాయుడు పీఆర్‌టీయు జిల్లా కార్యదర్శి శెట్టి. అప్పలరాజు, మండల అధ్యక్షుడు లక్ష్మయ్యలు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం వారు ఎమ్మెల్సీని మర్యాద పూర్వకంగా కలిసి ఉపాధ్యాయుల సమస్యలు వివరించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ఉపాధాయులు పడుతున్నా కష్టాలను శాసనమండలిలో ప్రస్తవిస్తానని, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ మండల కార్యదర్శి మండ్యాగురు. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడుకు సత్కారం

సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మంగళవారం పాడేరులో పర్యటించారు. మోదకొండమ్మతల్లితో పాటు ఉమానీలకంఠేశ్వరస్వామిలను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీతో పాటు వర్తకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలంతా ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. మోదకొండమ్మతల్లి, ఉమానీలకంఠేశ్వరస్వామి చిత్ర పటాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, పీఆర్‌టీయూ నేతలు దేముళ్లనాయుడు, హేమలత, ఉప సర్పంచ్‌ రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement