తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’
కొమ్మాది: సాగర తీర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రుషికొండ బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐ పి.మనోజ్ కుమార్ తీర ప్రాంతాల అప్రమత్తతపై మత్స్యకారులకు, పర్యాటకులకు వివరించారు. తీర ప్రాంతాల వెంబడి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఎలా ఎదుర్కొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, గూఢచారి వ్యవస్థలను ఎలా కనుగొనాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
డీఐజీ పర్యటన : సాగర్‌కవచ్‌లో భాగంగా రుషికొండ బీచ్‌లో బుధవారం రాత్రి మైరెన్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పర్యటించారు. ఇక్కడ బీచ్‌లోని పర్యాటకులతో కాసేపు మాట్లాడి, మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు మురళీకృష్ణ, పి. మనోజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో ఉత్కంఠగా సాగర్ కవచ్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో సాగర్ కవచ్ ఆపరేషన్ మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. సీఐఎస్‌ఎఫ్ క్రైం అండ్ ఇంటిలిజెన్స్ వింగ్ (సీఐడబ్ల్యూ) సిబ్బంది నలుగురు అగంతకులను పట్టుకున్నారు. ముంబై దాడులు అనంతరం దేశంలోని అన్ని సెక్యూరిటీ దళాలు కలిసి ఏటా రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహిస్తుంటారు. పరిశ్రమలు, సంస్థల్లో సెక్యూరిటీను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొంత మంది వ్యక్తులు సముద్ర జలాలు, రహదారుల మీదుగా పరిశ్రమల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆయా పరిశ్రమల సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధ, గురువారాలు రెండు రోజులు సాగర్ కవచ్ ఆపరేషన్‌గా నిర్ణయించారు. బుధవారం స్టీల్‌ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, సిఐడబ్ల్యూ సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇద్దరిని ప్లాంట్ ప్లాజా గేటు వద్ద, ఇద్దరిని వాచ్ టవర్ 30 గోడ వద్ద పట్టుకున్నారు. మొదటి రోజు విజయవంతంగా జరిగిన ఈ ఆపరేషన్ గురువారం కూడా కొనసాగనుంది.
తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’


