గాంధారి ఆకులు తినిరెండు పశువుల మృతి
పెదబయలు: మండలంలోని గోమంగి పంచాయతీ సరియాపల్లి సమీపంలో కొండలపై మొలకెత్తిన గాంధారి ఆకులు తిని రెండు దుక్కి టెద్దులు మృతి చెందినట్టు గ్రామానికి చెందిన పాడి రైతు కుంబిడి వెంకటరమణ తెలిపారు. ప్రతి ఏటా వేసవిలో కురిసిన వర్షాలకు ఈ కొండలపై గాంధారి మొక్కలు మొలకెత్తుతాయి. వేసవిలో పశుగ్రాసం కొరత వల్ల పశువులు ఈ ఆకులు, పువ్వులు తిన్న కొద్ది గంటల వ్యవధిలోనే మృతి చెందుతున్నాయని రైతులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్‌లో వారం రోజుల వ్యవధిలో గాంధారి ఆకులు తిని 13 పశువులు మృతి చెందాయని చెప్పారు. ప్రతి ఏడాది తీవ్రంగా నష్టపోతున్నామని, పశువులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని పాడి రైతులు కోరుతున్నారు. మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.
గాంధారి ఆకులు తినిరెండు పశువుల మృతి


