21న పాడేరు ఐటీడీఏపాలకవర్గ సమావేశం | - | Sakshi
Sakshi News home page

21న పాడేరు ఐటీడీఏపాలకవర్గ సమావేశం

Apr 10 2025 1:01 AM | Updated on Apr 10 2025 1:01 AM

21న పాడేరు ఐటీడీఏపాలకవర్గ సమావేశం

21న పాడేరు ఐటీడీఏపాలకవర్గ సమావేశం

పాడేరు : ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఈనెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్టు పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షు లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మండల పరిష త్‌ అధ్యక్షులు, జెడ్పీటీసీలకు సమాచారం పంపించినట్టు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లాఅధికారులు, డివిజన్‌ స్థాయి అధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

పోషకాహార లోపంనివారించేందుకు చర్యలు

ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌

చింతూరు: పిల్లల్లో పోషకాహార లోపంతో పాటు ఊబకాయ నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవ పోస్టర్‌ను బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ లబ్ధిదారులు స్వయంగా పోషణ ట్రాకర్‌లో నమోదు చేసుకునే విధానంపట్ల ప్రచారం నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయాలని, పక్షోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పీవో ఆదేశించారు.

వడగాడ్పుల నుంచి కాపాడుకోవాలి: ఎండవేడిమి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడగాడ్పుల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తల పా టించాలని ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ సూచించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్‌ను బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడదెబ్బ నుంచి రక్షణకు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలని, ఎండ కాసే సమయంలో ఇంటివద్దే ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏపీవో జగన్నాథరావు, ఈఈ మురళి, డిప్యూటీ డీఎంహెచ్‌వో పుల్లయ్య, సీడీపీవో విజయగౌరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement