అధైర్యపడొద్దు వచ్చేది మన ప్రభుత్వమే
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో అరకు ఎంపీ తనూజారాణి
చింతపల్లి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి అన్నారు. శుక్రవారం చింతపల్లి వచ్చిన ఆమె పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజన్నబిడ్డగా జగన్‌మోహన్‌రెడ్డిని మొదటినుంచి మన్యం వాసులు ఆదరిస్తున్నారని, ఇదే ఒరవడి రాబోవు ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మరోమారు పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తల ఽమధ్య చిన్న చిన్న విభేదాలున్నా వాటన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకుని, పార్టీ అభివృద్ధికి చిత్తఽశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ బాలయ్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు, చింతపల్లి సర్పంచ్‌దురియా పుష్పలత, ఎంపీటీసీలు దారలక్ష్మి, జయలక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు నాజర్‌వల్లీ తదితరులు పాల్గొన్నారు.


