పూలే సేవలు మరువలేనివి
పాడేరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతీరావు పూలే ఎనలేని కృషి చేశారని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో పూలే చిత్రపటానికి కలెక్టర్ దినేష్‌కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల అభ్యున్నతి కోసం కృషి తన జీవితాన్ని ధారాపోసిన మహానుభావుడు పూలే అని చెప్పారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మహిళలందరికీ మార్గదర్శకులన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఐటీడీఏ అధికారులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్వో పద్మాలత, ఐటీడీఏ ఏపీవోలు ప్రభాకర్‌రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పూలే సేవలు మరువలేనివి


