యూత్ బాక్సింగ్ టోర్నీలో నింజాస్ క్రీడాకారులు
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ఎటపాక: నందిగామలో కొలువైన అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణం శనివారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలివేలు మంగ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ వేడుకను వేదపండితుడు సుబ్రహ్మణ్యశర్మ ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది.
నర్సీపట్నం : విశాఖ పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుండి 13వ తేదీ జరుగుతున్న యూత్ ఉమెన్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ నర్సీపట్నం నింజాస్ అకాడమీ నుంచి ఆరుగురు బాక్సర్లు పాల్గొన్నారు. శాప్ కోచ్ అబ్బు, ఉమెన్ కోచ్ వేపాడ ప్రియాంక ఆధ్వర్యంలో రిషిత, ఆల్తీ శిరీష, కొంచాడ నందిని, బొండా హేమ, రాజరాజేశ్వరి, శశికుమార్ పాల్గొన్నారు.
క్లుప్తంగా


