జలవనరులను సద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి: ఏజెన్సీలో గిరిజన రైతాంగం దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా కాపాడుకోవాలని జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. లంబసింగి పంచాయతీ పరిధిలోని రావిమానుపాకలు గ్రామంలో సీఫా సంస్థ అద్వర్యంలో నిర్మించిన చెక్‌డ్యాంను ఆ సంస్థ సీఈవో శశిప్రభతో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ శాంతకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాడ్లాడారు. జలవనరులను సద్వినియోగం చేసుకుంటూ దేశీయ విత్తనాలను కాపాడుకోవాలన్నారు. కొండవాగులకు అడ్డకట్టలు వేసుకుని ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈవో శశిప్రభ మాట్లాడుతూ లంబసింగి పంచాయతీలోని 12 గ్రామాలను దేశీయ విత్తనాల గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో కూడా దేశీయ విత్తన పర్యాటక గ్రామాలు అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో చిరుధాన్యాలు, పప్పులు, పండ్లమొక్కలతో పాటు కందమూలాదులు వంటి మొక్కలను పెంచే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు నాగమణి, సంస్థ ప్రతినిదులు నర్సింగ్, రామలక్ష్మి, భాస్కర్, శ్రీనివాస్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.


