ఈదురు గాలులు.. వడగళ్ల వాన
గొర్రెలమెట్టలో ఎగిరిపోయిన పాఠశాల పై కప్పు
కొయ్యూరు/డుంబ్రిగుడ/హుకుంపేట : జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొయ్యూరు మండలంలో విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు పడడంతో సుమారు గంట సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పైడిపనుకుల, తుమ్మలబంధతోపాటు మరి కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట పాఠశాల భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మామిడి కాయలు, జీడి పిక్కలు నేరాలాయి. కృష్ణదేవిపేట–బలిఘట్టం లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డుంబ్రిగుడ మండలంలోని గుంటసీమ, అరకు, కించుమండ, సొవ్వా తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హుకుంపేట మండలంలోని తీగలవలస, తడిగిరి, మట్టుజోరు, శోభకోట పంచాయతీలతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా గాలులు,ఉరుములు మెరుపులు రావడంతో మండల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈదురు గాలులు.. వడగళ్ల వాన
ఈదురు గాలులు.. వడగళ్ల వాన


