ధాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో బాలికల ప్రతిభ
పాడేరు : మణిపూర్ రాష్ట్రం ఇంపాల్‌లో జరుగుతున్న 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్‌లో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చూపారు. మణిపూర్ రాష్ట్రం ఇంపాల్‌లో ఈనెల 7నుంచి 12 వరకు ధాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరిగాయి. అండర్–19 బాలికల కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 62 కేజీల విభాగంలో విజయవాడకు చెందిన భానుప్రియ, 70 కేజీల విభాగంలో అనకాపల్లికి చెందిన పి.దుర్గ కాంస్య పతకాలు సాధించారు. వీరికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వండల కొండబాబు, ఫిజికల్ డైరెక్టర్లు పాంగి సూరిబాబు, మత్స్యరాస భూపతిరాజు, కమలకుమారి కోచ్‌లుగా వ్యవహరించారు.


