సార్థకనామధేయుడు ‘వనజీవి’
అనకాపల్లి టౌన్: పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయమని పౌర్ణమి సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నారాయణరావు అన్నారు. పట్టణంలోని గవరపాలెం పార్కు సెంటర్‌లో ఆదివారం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మూగజీవాలకు గూళ్ళు, ధాన్యం కుంచెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ ఇంటి పేరునే వనజీవిగా మర్చుకొని మొక్కలు నాటడంలో దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టించి 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్న గొప్ప నేత అని కొనియా డారు. వేసవిలో పక్షులకు నీరు దొరకడం కష్టంగా ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు పక్షులకు నీరు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, కర్రి సన్యాసినాయుడు, పెంటకోట సురేష్, యల్లపు సంతోష్ కుమార్, అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
సార్థకనామధేయుడు ‘వనజీవి’


