
బాల్య వివాహాలను అడ్డుకోవాలి
రంపచోడవరం: బాల్య వివాహాలను అడ్డుకోవాలని రంపచోడవరం జేఎఫ్‌సీ మేజిస్ట్రేట్ ,న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.మురళీగంగాధర్ అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎర్లీ ప్రెగ్నెన్సీ, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేజిస్ట్రేట్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలన చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రంపచోడవరం బార్ ప్రెసిడెంట్ , ప్యానల్‌అడ్వకెట్ ఏఆర్ భగవాన్ మాట్లాడుతూ విద్యార్ధులు చట్టాలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ అధికారి కె.ఉమా, గైనకాలజిస్టు డాక్టర్ మోమీనా సాజిద్‌లు విద్యార్థులకు చట్టాలు, ఆరోగ్య భద్రత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఎంఈఓ శ్రీనివాసరావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.