
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ఎమ్మెల్యే మత్స్యలింగం
అరకులోయటౌన్: జిల్లా కేంద్రం పాడేరులోని చింతలవీధిలో గణేష్ నిమజ్జనోత్సవంలో భక్తులు ప్రమాదానికి గురై మృతి చెందడంపై దిగ్భ్రాంతికి గురిచేసిందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. థింసా నృత్యం చేస్తూ ఊరేగింపు గా వెళ్తున్న భక్తులపై స్కార్పియో వాహనం దూసుకుపోయిన సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరు గైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు.