
ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర
2004 నాటికి ఉమ్మడి విశాఖ జిల్లా పారిశ్రామికంగా సంక్షోభంలో ఉంది. స్టీల్ ప్లాంట్, బీహెచ్‌పీవీ, షిప్‌యార్డ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలతో మూసివేత దశకు చేరుకున్నాయి. వైఎస్సార్ ఈ సంస్థల పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించి, రెండో దశ విస్తరించాలని నిర్ణయించారు. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ (బీహెచ్‌పీవీ)ని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేసి, దానికి కొత్త జీవం పోశారు. మూతపడే స్థితిలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డ్‌ను రక్షణ శాఖలో విలీనం చేసి పునరుద్ధరించారు. అలాగే అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణ సమస్యలను పరిష్కరించి, పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమం చేశారు.