
పేద రోగులకు అండ
అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకు పరిచయం చేయాలని వైఎస్సార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. దీంతో ఒక్క సారిగా విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు పెరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో.. హైదరాబాద్ నిమ్స్ తరహాలో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నిర్మాణానికి 2006లో శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను విశాఖకు తరలించి, నగర తాగునీటి సమస్యతో పాటు స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలను తీర్చారు. రాజీవ్ గృహకల్ప, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకాల ద్వారా నగర పరిధిలో లక్షకు పైగా ఇళ్లను నిర్మించి, ఎందరో పేదల సొంతింటి కలను నెరవేర్చారు.