
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
పాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వీవీ జయ పిలుపునిచ్చారు. స్థానిక పీఎంఆర్‌సీలో గురువారం నిర్వహించిన ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ద్వితీయ జిల్లా మహా సభలో ఆమె మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అడ్డుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు, పర్మినెంట్ చేయడం వంటిలో ఆసక్తి చూపని ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బందులు పెట్టే చట్టాలను తీసుకువస్తున్నాయన్నారు. ఆశా కార్యకర్తల సంఘం ఏర్పాటుచేసిన తరువాత అనేక సమస్యలు పోరాటం ద్వారా పరిష్కరం అయ్యాయన్నారు. భవిష్యత్తులో కనీస వేతనం రూ.26 వేలకు పెంచడం, యాప్‌ల ద్వారా వర్క్ లోడ్ తగ్గించడం, రాజకీయ వేధింపులు అరికట్టడం, సమస్యలు పరిష్కరించాలన్న నినాదంతో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు.