
జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో సీలేరు జెన్‌కో ఉద్యోగుల ప్ర
● తృతీయస్థానం సాధనలో కీలకపాత్ర
● బెస్ట్ విన్నర్‌గా స్థానిక క్రీడాకారుడుశ్రీనివాస్
సీలేరు: తెలంగాణలోని యాదగిరిగుట్టలో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ జట్టు తరఫున సీలేరు విద్యుత్ కాంప్లెక్సుకు చెందిన ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల ఒకటి నుంచి గురువారం వరకు జరిగిన ఈ పోటీల్లో ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ జట్టు తెలంగాణ జట్టుపై విజయం సాధించి తృతీయస్థానంలో నిలిచింది. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌కు చెందిన ఏడీ కె.శ్రీనివాసులు కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదే ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు కె.శ్రీనివాస్ బెస్ట్ విన్నర్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీల్లో సీలేరు జెన్‌కోకు చెందిన క్రీడాకారులు శామ్యూల్, ప్రసాద్ పాల్గొన్నారని జట్టు మేనేజర్ సీహెచ్ సురేష్ తెలిపారు.