
ఎరువులు అధిక ధరలకువిక్రయిస్తే చర్యలు
● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: ఎరువులు కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ హెచ్చరించారు. గురువారం ఆయన చింతూరులోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో కున్న స్టాక్, విక్రయించిన ఎరువులు, ధరల వివరాలను ఆయన పరిశీలించారు. ఈ పోస్ యంత్రం ద్వారా ఎరువులు విక్రయించాలని, త్వరలోనే చింతూరు మండలానికి యూరియా సరఫరా అవుతుందని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్, వ్యవసాయాధికారి రత్నప్రభ పాల్గొన్నారు.