
నిరుద్యోగులను మోసగిస్తున్న రాజేష్, రవితేజలపై చర్యలు తీ
పాడేరు : పశుసంవర్థక శాఖలో 1962 వెటర్నరీ డిపార్ట్‌మెంట్ భవ్య సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని ఓఈ కిల్లారి రాజేష్, హెచ్‌ఆర్ రవితేజలు నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చింతపల్లి లోకేషన్‌లో డాక్టర్ ఉద్యోగానికి కొంత డబ్బులు ఫోన్‌పే, మరికొంత మంది నగదు ఇచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. గతంలో చింతపల్లి లోకేషన్‌లో పైలేట్‌గా పని చేసిన వ్యక్తికి డబ్బులు అడగడం వల్ల ఆయన ఇవ్వకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, అదే విధంగా పెదబయలు మండలం పైలెట్‌గా పని చేసిన వ్యక్తిని సైతం తొలగించారని అన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని వేలాది రూపాయలు వసూలు చేస్తున్న రాజేష్, రవితేజలపై ఆ సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి, మళ్లీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.