
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
పాడేరు : మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు. ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని ఎంకే వీధి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయ న తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్‌కు సూచించారు. పాత పాడేరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టీల్లో తప్పులను గుర్తించారు. పాఠశాల హెచ్‌ఎంకు మెమో జారీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. మండల స్థాయి ఐసీడీఎస్ స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. సుండ్రుపుట్టు జీసీసీ డీఆర్ డిపోను తనిఖీ చేశారు. స్టాక్‌ను పరిశీలించారు. రికార్డులో పొందుపర్చిన స్టాక్‌తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను సరి చూశారు. వేయింగ్ మిషన్ లైసెన్స్‌ను పరిశీలించారు. రేషన్ కార్డుదారులకు సకాలంలో అన్ని రకాల సరుకులు అందజేయాలని ఆదేశించారు. ఆయన వెంట సివిల్ సఫ్లై డీఎస్‌వో మోహన్‌రావు, సీఎస్‌డీటీ ప్రశాంత్, డీఈవో బ్రహ్మాజీరావు, పుడ్ సేప్టీ అధికారి గ్రీష్మ, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అనురాధ, ఎంఈవో సరస్వతిదేవి, లైజనింగ్ అధికారి బాకా తేజ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు
కాంతారావు ఆదేశం
ఎంకే వీధి అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులు సక్రమంగా
నిర్వహించకపోవడంపై ఆగ్రహం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం