
పారదర్శకతతో సామాజిక తనిఖీలు
వై.రామవరం: మండలంలో ఉపాధి హామీ పనుల తనిఖీలను పారదర్శకతతో నిర్వహించాలని సామాజిక తనిఖీ బృందం ఎస్‌ఆర్‌పీ అత్యుత్ డీఆర్పీలకు, విలేజ్ సర్వే యర్లకు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉపాధి పనుల తనిఖీల నిమిత్తం ఎంపీడీవో బాలన్నదొర అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీల సమన్వయ సమావేశంలో ఎస్‌ఆర్‌పీ అత్యుత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మండలంలో నిర్వహించిన 2,243 పనులకు సంబంధించి, రూ.11,50,69,685ల ఖర్చుపై సామాజిక తనిఖీ చేశామన్నారు. తనిఖీలను ప్రతీ ఒక్కరు పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ఏపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.