
విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ
చింతపల్లి: చింతపల్లి డిగ్రీ విద్యార్దులకు విజ్ఞాన విహార యాత్రలో బాగంగా విశాఖపట్నం రైల్వే ఈస్ట్ కోస్ట్ జోన్ అఽధికారులు టికెట్ కన్సలేషన్ ఫామ్స్ మంజూరు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ భారతి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ కన్సోలేషన్ ఫామ్స్‌తో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా విద్యార్దులు విహార విజ్ఞాన యాత్రలు చేయవచ్చన్నారు.అదే విధంగా ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎల్.వెంకటరామిరెడ్డి విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉపయోగపడే రూ.30వేలు విలువైన పుస్తకాలను కళాశాలకు వితరణగా అందించినట్టు తెలిపారు.ఈ పుస్తకాలను కళాశాల గ్రంథాలయంలో భద్రపరచడం జరిగిందన్నారు. ఈ పుస్తకాలను వ వినియోగించుకొని పోటీ పరిక్షలకు సన్నద్దమై మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు పోటీ పరిక్షలు పుస్తకాలను అందజేశారు. అద్యాపకులు రవీంద్రనాయక్, జగదీష్, రమణ, లీలాపావని ,కెజీయారాణి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.